CM Chandrababu Naidu: నేడు తూర్పున సీఎం పర్యటన
ABN , Publish Date - Jul 01 , 2025 | 05:45 AM
సీఎం చంద్రబాబు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో పర్యటించనున్నారు.

ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేయనున్న చంద్రబాబు
రాజమహేంద్రవరం, జూన్ 30(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మంగళవారం తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం తాళ్లపూడి మండలం మలకపల్లిలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10.30 గంటలకు కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి కారులో 10.45 గంటలకు మలకపల్లి చేరుకుంటారు. లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ చేస్తారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదికలో పాల్గొన్ని పీ-4 పథకం కింద నిరుపేద కుటుంబాలను దత్తత తీసుకునే వారితో ముఖాముఖి సంభాషిస్తారు. అనంతరం కాపవరంలో కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. కాపవరం నుంచి 3.30 గంటలకు రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి 3.40 గంటలకు బయలుదేరి చిత్తూరు పర్యటన నిమిత్తం బెంగళూరు వెళతారు. ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి కందుల దుర్గేశ్, జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి, ఎమ్మెల్యే ముప్పిడి వేంకటేశ్వరరావు పర్యవేక్షించారు.