Share News

DRDO ULPGM V3: కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు

ABN , Publish Date - Jul 25 , 2025 | 03:50 PM

కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు.

DRDO ULPGM V3: కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డ్రోన్ మిసైల్ ప్రయోగంపై సీఎం చంద్రబాబు హర్షాతిరేకాలు
DRDO ULPGM V3

అమరావతి, జులై, 25: కర్నూలులోని టెస్టింగ్‌ రేంజ్‌లో డీఆర్‌డీఓ డ్రోన్ ద్వారా మిసైల్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై ఏపీ సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. మన దేశ రక్షణ పర్యావరణ వ్యవస్థ వృద్ధికి దోహదపడటం ఆంధ్రప్రదేశ్ కు గర్వంగా ఉందని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్ (NOAR)లో UAV-లాంచ్డ్ ప్రెసిషన్ గైడెడ్ క్షిపణి (ULPGM-V3) పరీక్ష విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. మన దేశ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడంలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగని సీఎం అభివర్ణించారు. ULPGM-V3 విజయం ఆత్మనిర్భర్ భారత్ నిజమైన స్ఫూర్తిని ప్రతిబింబిస్తోందని చంద్రబాబు అన్నారు. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేసిన ట్వీట్ కు ప్రతిస్పందనగా చంద్రబాబు ఈ సందేశమిచ్చారు.


ఇదిలా ఉండగా, భారత రక్షణ రంగ పరిశోధన సంస్థ (డీఆర్‌డీఓ) మరో విజయాన్ని అందుకుంది. డ్రోన్ ద్వారా ప్రిసిషన్ గైడెడ్ మిసైల్‌-వీ3ని (యూఎల్‌పీజీఎమ్) విజయవంతంగా ప్రయోగించింది. కర్నూల్‌లోని నేషనల్ ఓపెన్ ఏరియా రేంజ్‌‌లో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగంలో డీఆర్‌డీఓతోపాటు రక్షణ రంగానికి చెందిన పలు సంస్థలు పాల్గొన్నాయి. పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌‌నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. స్వదేశీ రక్షణ రంగ సామర్థ్యాల అభివృద్ధికి ఈ ప్రయోగం గొప్ప ప్రోత్సాహకమని వ్యాఖ్యానించారు.


మరోవైపు టాలీవుడ్ నటుడు నారా రోహిత్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు చంద్రబాబు. ఆరోగ్యం, ఆనందంతో కూడిన విజయాలు సిద్ధించాలని ఆకాంక్షించారు.


అటు, టాలీవుడ్ నటులు కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా కైకాలను గుర్తు చేసుకున్నారు చంద్రబాబు. 'సుమారు 800 చలన చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలను పోషించి సినీ అభిమానులను ఆరు దశాబ్దాలపాటు మెప్పించిన పరిపూర్ణ నటులు, తెలుగుదేశం పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యులు కైకాల సత్యనారాయణ జయంతి సందర్భంగా ఆయన కళాసేవను, ప్రజాసేవను స్మరించుకుందాం' అని తన ఎక్స్ ఖాతాలో చంద్రబాబు పోస్ట్ చేశారు.


మరోవైపు చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన నారా భువనేశ్వరి కూడా నారా రోహిత్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ఆయురారోగ్య ఆనందాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.


ఇవి కూడా చదవండి..

డ్రోన్ ద్వారా మిసైల్‌ను ప్రయోగించిన డీఆర్‌డీఓ

మాజీ ఉపరాష్ట్రపతికి టైప్ 8 బంగళా కేటాయించిన కేంద్రం.. అసలు ఇదేంటంటే..

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 05:36 PM