Kuppam: కుప్పానికి మరో రెండు పరిశ్రమలు
ABN , Publish Date - Nov 11 , 2025 | 01:54 AM
కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
కుప్పం, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): కుప్పం నియోజకవర్గానికి రూ.2979 కోట్ల పెట్టుబడితో మరో రెండు భారీ పరిశ్రమలు రానున్నాయి. రాష్ట్ర రాజధానిలో సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎలకా్ట్రనిక్ పరికరాలను తయారు చేసే ఎన్‌పీఎ్‌సపీఎల్ పరిశ్రమను రూ.2,081 కోట్లతో ప్రతిపాదించారు. అలాగే హ్వాసింగ్ ఫుట్ వేర్ కంపెనీని రూ.8,570 కోట్లతో ప్రతిపాదించారు. ఈ రెండు కంపెనీల స్థాపనకు సంబంధించి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఎలకా్ట్రనిక్ పరికరాల తయారీ కంపెనీ ద్వారా 600 ఉద్యోగాలు,ఫుట్ వేర్ కంపెనీ ద్వారా 17,645 ఉద్యోగాలు లభించనున్నాయి.ఫుట్ వేర్ కంపెనీకోసం (తోలు రహిత) కుప్పం నియోజకవర్గ పరిధిలో 103.19 ఎకరాల భూమి కేటాయించనున్నారు.ఏడాదికి 12.84 మిలియన్ల జతల చెప్పుల తయారీ సామర్థ్యం ఉంటుందని అంచనా వేశారు. ఇవిగాక రూ.2,203 కోట్ల పెట్టుబడితో 7 పరిశ్రమలకు ఈనెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ పరిశ్రమలతో ఏకంగా 22వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని ప్రకటించారు. దీంతో సమీప భవిష్యత్తులో కుప్పం పారిశ్రామిక స్వర్గధామంగా రూపుదాల్చనుంది. వేలాది ఉద్యోగాల కల్పనతో స్థానిక యువతకు ఉపాధి లభించడంతోపాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల యువతకు కూడా కుప్పం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కుప్పంలో పుష్కలంగా దొరకనున్నాయి.
నేడు రూ.206 కోట్లతో ఎఫ్‌ఎ్‌ఫసీకి శంకుస్థాపన
కుప్పంలో మరో కంపెనీకి వర్చువల్ శంకుస్థాపన జరుగనుంది. కుప్పం మున్సిపాలిటీ పలార్లపల్లె వద్ద రూ.206.16 లక్షలతో ఏర్పాటు చేయనున్న ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ (ఎఫ్‌ఎ్‌ఫసీ)కి మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతినుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేస్తారని ఏపీఐఐసీ డైరెక్టర్ మల్లానూరు ప్రేమ్‌కుమార్ తెలిపారు.
పలార్లపల్లెలో ఇప్పటికే ఇండస్ట్రియల్ ఎస్టేట్‌కోసం 18.70 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులోని 5 ఎకరాలను ఎఫ్‌ఎఫ్‌సీకి కేటాయించారు. మంగళవారం ఉదయం 10.30 గంటలకు జరిగే ప్రారంభ కార్యక్రమానికి సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌ను, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సీఆర్ రాజన్‌ను ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రేమ్‌కుమార్ ఆహ్వానించారు.