Water: తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించండి
ABN , Publish Date - Apr 11 , 2025 | 01:06 AM
‘వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలకు అందించాలి. ఇందులో భాగంగా తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలి’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు.

చిత్తూరు కలెక్టరేట్/ సెంట్రల్, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): ‘వేసవిలో తాగునీటి సమస్య లేకుండా ప్రజలకు అందించాలి. ఇందులో భాగంగా తరచూ తాగునీటి నాణ్యతను పరీక్షించాలి’ అని కలెక్టర్ సుమిత్‌కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లోని మీటింగ్ హాలులో తాగునీటి సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై గ్రామీణ నీటి సరఫరా శాఖ డీడీ, ఏఈలతో ఆయన సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఓవర్‌హెడ్ ట్యాంకులను 15 రోజులకు ఒకసారి క్లీనింగ్ చేయాలని, ఆ ఫొటోలు తీసి తనకు పంపాలన్నారు. లీకేజీ ఉన్న పైపులను వెంటనే రీప్లేస్ చేయాలని చెప్పారు. లేదంటే మురుగు చేరి, నీరు కలుషితమై వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో చేసిన పనులకు సంబంధించిన బిల్లులను జిల్లా పరిషత్‌కు పంపాలని, వాటిని వెంటనే పాస్ చేయాలని జడ్పీ సీఈవోను ఆదేశాలిచ్చారు. విద్యుత్ సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. విజయపురం, నిండ్ర మండలాల్లోని 44 గ్రామాలలో తాగునీటిని అందిస్తున్నామని ఎస్‌ఈ విజయ్‌కుమార్ కలెక్టర్‌కు తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో సుధాకర్‌రావు పాల్గొన్నారు.
నేటి ఉద్యాన సదస్సుకు విస్తృత ఏర్పాట్లు
చిత్తూరులో శుక్రవారం నిర్వహించే ఉద్యాన సదస్సును విజయవంతం చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. సదస్సు నిర్వహణ, ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్‌లోని తన సమావేశ మందిరంలో ఉద్యాన, వ్యవసాయ అనుబంధ శాఖలు, పౌరసరఫరాల సంస్థ, శాఖ, డీఆర్‌డీఏ, డీఎన్‌డీఏవో అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్‌పీఎ్‌స పెవిలియన్ కన్వెన్షన్ హాలులో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మామిడి అమ్మకం, కొనుగోలుదారులతో ఎగుమతి అవకాశాలపై రైతులతో నిర్వహించే ఈ సదస్సులో పొరపాట్లు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.
రాష్ట్ర స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, సుమారు 500 మంది రైతులు పాల్గొంటారన్నారు.సమావేశంలో వ్యవసాయాధికారి మురళీకృష్ణ, పట్టుపరిశ్రమ శాఖ జేడీ శోభారాణి, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రెడ్డి, డీఎ్‌సడీవో శంకరన్, డీఎం సివిల్ సపస్లయీస్ బాలకృష్ణ, డీఆర్‌డీఏ పీడీ రవి తదితరులు పాల్గొన్నారు.