Share News

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత

ABN , Publish Date - Apr 21 , 2025 | 01:04 AM

భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమైంది.

Temperature: 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత
బోసిపోయిన చిత్తూరు ఎమ్మెస్సార్‌ సర్కిల్‌

చిత్తూరు కలెక్టరేట్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఆదివారం కూడా ఉదయం 10 గంటల నుంచే ఎండ తీవ్రత అధికమైంది. రాత్రి 8 గంటలు దాటినా ఉక్కపోత తగ్గలేదు. ఆదివారం గరిష్ఠంగా నగరి మండలంలో 42.5, తవణంపల్లెలో 42, శ్రీరంగరాజపురంలో 40.2 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మండలాలవారీగా.. చిత్తూరు, గుడిపాల మండలాల్లో 39.5, గంగాధరనెల్లూరులో 39.2, పులిచెర్ల, పూతలపట్టు, వెదురుకుప్పం మండలాల్లో 39, బంగారుపాళ్యంలో 38.8, సోమలలో 38.4, సదుంలో 38, యాదమరిలో 37.8, చౌడేపల్లె, ఐరాల, పెనుమూరు, నిండ్ర, పాలసముద్రం, విజయపురం మండలాల్లో 37.7, గంగవరం, పెద్దపంజాణి, రొంపిచెర్ల మండలాల్లో 37.4, కార్వేటినగరంలో 37.3, గుడుపల్లె, శాంతిపురం మండలాల్లో 35.8, కుప్పంలో 35.5, పలమనేరు, వి.కోట మండలాల్లో 35.2, బైరెడ్డిపల్లెలో 34.8, రామకుప్పంలో 34.1, పుంగనూరులో 34 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Updated Date - Apr 21 , 2025 | 01:04 AM