Kumki Elephant Training Center: కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్..
ABN , Publish Date - Nov 09 , 2025 | 07:11 PM
పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు.
చిత్తూరు: పలమనేరు ముసలిమడుగు వద్ద కుంకీ ఏనుగుల ఆపరేషన్ కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గజరాజుల విన్యాసాలను పవన్ కల్యాణ్, అధికారులు తిలకించారు. ఏనుగులు కృష్ణా, అభిమన్యులకు పవన్ స్వయంగా ఆహారాన్ని అందించారు. కాగా, ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఈ కుంకీ ఏనుగుల కేంద్రం ఏర్పాటు చేశారు. నాలుగు కుంకీ ఏనుగులను కర్ణాటక రాష్ట్రం నుంచి తెచ్చిన సంగతి తెలిసిందే. అటవీ ఏనుగులు జనావాసాలు, పంటపొలాల్లో పడి నాశనం చేయకుండా ఈ కుంకీ ఏనుగులు అడ్డుకుంటాయి. దీని కోసమే ప్రత్యేకంగా వాటిని ఆ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు.
ఈ కార్యక్రమం అనంతరం అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో హనుమాన్ అనే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించారు ఉపముఖ్యమంత్రి పవన్. హనుమాన్ అనే కార్యక్రమంలో 11 అంశాలను పొందుపరిచారు అటవీ శాఖ అధికారులు. హనుమాన్ అంటే హీలింగ్ అండ్ నర్చరీంగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్ ఎయిడ్ అండ్ వైడ్ లైఫ్ అని అర్థం. నిర్దేశిత సమయంలో హనుమాన్ లక్ష్యాలను చేరుకునే ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా అటవీ శాఖకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 18, 19 తేదీల్లో హనుమాన్‌పై ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. అటవీ, పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొనాలని హుకుం జారీ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి:
MP Sivanath: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి: ఎంపీ శివనాథ్
AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్.. ఈసారి ఏయే అంశాలు చర్చిస్తారంటే..