Share News

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు

ABN , Publish Date - Dec 01 , 2025 | 12:11 AM

పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు.

Boyakonda: బోయకొండలో ఆన్‌లైన్‌ సేవలు
గంగమ్మ

చౌడేపల్లె, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ భక్తుల సౌకర్యం కోసం అమ్మవారి సేవలు ఆన్‌లైన్‌ ద్వారా కూడా పొందవచ్చునని ఈవో ఏకాంబరం పేర్కొన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం భక్తులకు మెరుగైన సేవలు అందిచాలనే ఉద్దేశంతో ఇక నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ టీఈఎంపీఎల్‌ఈఎస్‌. ఓఆర్‌జీ వెబ్‌సైట్‌, లేక 9552300009 ద్వారా మన మిత్ర వాట్స్‌యాప్‌ ద్వారా అమ్మవారి సేవలు, ప్రసాదాలు, దర్శనం, వసతి తదితర సౌకర్యాలు పొందవచ్చునని పేర్కొన్నారు. ఈ సదుపాయాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కాగా ఆదివారం గంగమ్మ ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. తీర్థప్రసాదాలు అందుకున్నారు. ఆలయ ఈవో ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Dec 01 , 2025 | 12:11 AM