Share News

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నెల 30న కోటా విడుదల

ABN , Publish Date - Apr 29 , 2025 | 09:47 PM

TTD: తిరుమల తిరుపతి దేవస్థానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అందులోభాగంగా శ్రీవారి స్వచ్ఛంద సేవలు.. పలు మార్పులు చేర్పులతో త్వరలో అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.

TTD: టీటీడీ కీలక నిర్ణయం.. ఈ నెల 30న కోటా విడుదల

తిరుమల, ఏప్రిల్ 29: శ్రీవారి స్వచ్ఛంద సేవలు.. పలు మార్పులు చేర్పులతో త్వరలో అందుబాటులోకి రానున్నాయి. తిరుమల,తిరుపతికి సంబంధించిన జనరల్‌ శ్రీవారి సేవ ఉదయం 11 గంటలకు, మహిళలకు నవనీత సేవ మధ్యాహ్నం 12 గంటలకు, పురుషులకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి గంటకు, కొత్తగా ప్రారంభించిన గ్రూప్‌ లీడ్‌ సేవ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు. పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు రెండేళ్లుగా సేవలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే.

వయసు 45-70 సంవత్సరాల మధ్య ఉన్నవారు తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇకపై వీరిని గ్రూప్‌ లీడర్స్‌ అని పిలవనున్నారు. వీరు 15 రోజులు, నెల లేదా మూడు నెలల వ్యవధితో సేవ చేయడానికి ఆన్‌లైన్‌లో ఎంపిక చేసుకోవచ్చు. వీరు శ్రీవారి సేవకుల పనిని పర్యవేక్షించడం, వారి హాజరు తీసుకోవడం తదితర బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. పరకామణి సేవలో కనీసం పదో తరగతి విద్యార్హత కలిగిన పురుషులకు మాత్రమే అవకాశం కల్పించాలని ఇప్పటికే టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ ద్వారా పరకామణి సేవను సైతం నమోదు చేసుకోవచ్చు.


మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు సూచనల మేరకు టీటీడీ ఉన్నతాధికారులు ఇప్పటికే శ్రీసత్యసాయి సేవాసంస్థ (పుట్టపర్తి), ఇషా ఫౌండేషన్‌ (కోయంబత్తూర్‌), ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ (బెంగళూరు) వంటి సంస్థలను సందర్శించి.. స్వచ్ఛంద సేవలపై అధ్యయనం చేశారు. ఈ మార్పులకు అనుగుణంగా జూన్‌ మాసం ఆన్‌లైన్‌ కోటాను టీటీడీ బుధవారం అంటే ఈ నెల 30వ తేదీన విడుదల చేయనుంది.

ఇవి కూడా చదవండి

Gopireddy Srinivasa Reddy: వైసీపీ మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డిపై కేసు నమోదు

Gorantla Madhav: ఈ ప్రభుత్వాన్ని అసహ్యించుకొంటున్న ప్రజలు

Maryam: భారత్‌లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి

Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి

For More AP News and Telugu News

Updated Date - Apr 29 , 2025 | 09:52 PM