Share News

Bhanu Prakash Reddy: భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్

ABN , Publish Date - Nov 26 , 2025 | 11:35 AM

భూమన కరుణాకర్ రెడ్డిపై భాను ప్రకాష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కరుణాకర్ పిట్ట కధలు చెప్పారంటూ వ్యాఖ్యలు చేశారు.

Bhanu Prakash Reddy: భూమన వ్యాఖ్యలు శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశాయ్: భానుప్రకాష్
Bhanu Prakash Reddy

తిరుమల, నవంబర్ 26: టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై (Bhumana Karunakar Reddy) బోర్డు సభ్యుడు భాను ప్రకాష్ రెడ్డి (Bhanu Prakash Reddy) ఫైర్ అయ్యారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసు విచారణకు హాజరైన తరువాత కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయన్నారు. కేసు అంశంపై మాట్లాడకుండా కరుణాకర్ రెడ్డి పిట్ట కథలు చెప్పారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొంగను దాతగా.. దొంగతనాన్ని బహుమతిగా మారుస్తూ పాలకమండలి తీర్మానంపై ఎందుకు సంతకం పెట్టారని ప్రశ్నించారు.


తీర్మానం ఆమోదించి.. తనకు సంబంధం లేదంటే ఎలా అని నిలదీశారు. నిప్పు.. ఉప్పు అంటున్న భూమన ఎందుకు సంతకం చేశారో భక్తులకు చెప్పాలని డిమాండ్ చేశారు. దొంగతనం చేసిన సీసీ టీవీ ఫుటేజ్‌ను ఎందుకు తొలగించారని అడిగారు. వీఐ శివశంకర్ రెడ్డిపై అనేక ఆరోపణలు వస్తే చర్యలు ఎందుకు తీసుకోలేదంటూ ప్రశ్నలు సంధించారు. పరకామణిలో చోరీ అయిన ప్రతి పైసాని రాబడుతామన్నారు. పరకామణి కేసులోని నిందితులను శిక్షించే వరకు పోరాడుతామని భానుప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

బాబోయ్ చిరుత.. భయాందోళనలో ఎస్వీయూ స్టాఫ్

ఏపీ మాక్ అసెంబ్లీ ప్రారంభం.. అన్నీ తామై నడిపిస్తున్న విద్యార్థి ప్రతినిధులు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 26 , 2025 | 12:11 PM