Share News

Bear: విద్యుత్తు తీగలు తగిలి ఎలుగుబంటి మృతి!

ABN , Publish Date - Apr 11 , 2025 | 01:12 AM

విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.

Bear: విద్యుత్తు తీగలు తగిలి ఎలుగుబంటి మృతి!
మృతి చెందిన ఎలుగుబంటి

భాకరాపేట, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది. చిన్నగొట్టిగల్లు మండలం చిట్టిచర్ల పంచాయతీ తుమ్మసేనపల్లి అటవీ సరిహద్దు ప్రాంతంలో పెదనాయన చెరువు సమీపంలో అడవి జంతువుల కోసం పెట్టిన విద్యుత్‌ తీగలు తగిలి గురువారం మృతి చెందినట్లు సమాచారం. దీనిపై అటవీ అధికారులు తమకు సమాచారం లేదని చెబుతున్నారు. కొన్ని రోజులుగా ఈ ప్రాంతాల్లో అడవి జంతువుల కోసం విద్యుత్‌ తీగలు పెడుతున్నారు. జంతువులు బలైపోతున్నాయి. ఇటీవల కరెంట్‌ తీగలు తగిలి ఓ ఏనుగు చనిపోయింది.

Updated Date - Apr 11 , 2025 | 01:13 AM