Kakinada Boat Rally: జయహో చంద్రన్న
ABN , Publish Date - Apr 30 , 2025 | 05:46 AM
వేట విరామ సమయంలో మత్స్యకారులకు పరిహారం పెంచడంపై బోట్ల యజమానులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఉప్పుటేరులో బోట్ల ర్యాలీ నిర్వహించారు.

ఇంటర్నేట్ డెస్క్: వేట విరామ సమయంలో మత్స్యకారులకు అందించే పరిహారాన్ని 10 వేల నుంచి 20 వేలకు పెంచడంపై బోట్ల యజమానులు, లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆధ్వర్యంలో మంగళవారం ఉప్పుటేరులో బోట్ల ర్యాలీ నిర్వహించారు. ఏటిమొగ నుంచి జగన్నాథపురం పాత వంతెన వరకు 200 బోట్లతో ర్యాలీ జరిపారు. చంద్రబాబు ప్లెక్సీలు, టీడీపీ జెండాలను బోట్లకు కట్టి పసుపుమయం చేశారు. మత్స్యకార నాయకులు సంగాని నాగేశ్వరరావు, బలసాడి రంగారావు, బోట్ల యజమానులు పాల్గొన్నారు.
- కాకినాడ సిటీ, ఆంధ్రజ్యోతి