Pemmasani Chandrasekhar Statement: ఉనికి చాటుకునేందుకే జగన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 18 , 2025 | 06:15 AM
వైసీపీ హయాంలో గాడితప్పిన పాలనను కూటమి ప్రభుత్వం దారిలో పెడుతుంటే...

బాబుకున్న ఇమేజ్‌తోనే రాష్ట్రానికి కొత్త కంపెనీలు
రప్పా రప్పా అంటే పెట్టుబడులు రావు: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
రాజోలులో 2.27 కోట్లతో నిర్మించిన హెడ్‌పోస్టాఫీ్‌సకు ప్రారంభోత్సవం
ద్వారకాతిరుమల, రాజోలు, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘వైసీపీ హయాంలో గాడితప్పిన పాలనను కూటమి ప్రభుత్వం దారిలో పెడుతుంటే... జగన్ తన ఉనికి చాటుకునేందుకు రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం దారుణం’ అని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో శ్రీవారి ఆలయ సందర్శన అనంతరం ఆయన గ్రామంలో తిరుగుతూ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకట్రాజుతో కలసి నిర్వహించారు. ఏడాదిలో కూటమి ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధిని చేసిందో వివరించారు. ‘జగన్ అంటున్నట్టు రప్పా రప్పా అంటే ఎవరైనా పెట్టుబడులు పెడతారా? చంద్రబాబుకున్న ఇమేజ్‌తోనే రాష్ట్రానికి కంపెనీలు వస్తున్నాయి. ఎంత కష్టమైనా సంక్షేమాన్ని, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం’ అని అన్నారు.
ప్రతి పోస్టల్ ఉద్యోగీ ఓ మొబైల్ ఏటీఎం
ప్రతీ పోస్టల్ ఉద్యోగిని మొబైల్ ఏటీఎంగా మార్చే ప్రత్యేక కార్యక్రమం చేపట్టబోతున్నామని పెమ్మసాని అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో పోస్టాఫీసులన్నీ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతున్నాయన్నారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు మండలం రాజోలులో కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.2.27 కోట్లతో నూతనంగా నిర్మించిన రాజోలు హెడ్‌పోస్టాఫీసు కార్యాలయాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం శివకోడు శ్రీమంగెన గంగయ్య తెలగా కల్యాణ మండపంలో అమలాపురం ఎంపీ గంటి హరీశ్ బాలయోగి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..
CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్