Car Driver : 4.5 కోట్ల బంగారు ఆభరణాలతో చెక్కేశాడు
ABN , Publish Date - Jan 12 , 2025 | 06:00 AM
రూ.4.5కోట్ల విలువ చేసే 6.5 కేజీల బంగారు అభరణాలతో కారు డ్రైవర్ పరారయ్యాడు.

యజమానులను మోసగించి పరారైన డ్రైవర్
జగ్గయ్యపేట/ నందిగామ, జనవరి 11(ఆంధ్రజ్యోతి): రూ.4.5కోట్ల విలువ చేసే 6.5 కేజీల బంగారు అభరణాలతో కారు డ్రైవర్ పరారయ్యాడు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జరిగింది. విజయవాడలోని బీఎన్‌ఆర్ జ్యూయలర్స్ సంస్థ ప్రతినిధులు హైదరాబాద్, హిమాయత్‌నగర్‌లోని శ్యాంబాబు జ్యుయలర్స్ వద్ద బంగారు అభరణాలు తీసుకొని కారులో బయల్దేరారు. కారులో డ్రైవర్ జితేశ్‌తో బీఎస్‌ఆర్ జ్యూయలర్స్ ఉద్యోగులు బాలకృష్ణ, అంబుదాస్ ఉన్నారు. మధ్యాహ్నం జగ్గయ్యపేట సమీపంలోని ఫుడ్‌ప్లాజాలో టిఫిన్ చేద్దామని జితేశ్ అనటంతో బాలకృష్ణ, అంబుదా్‌స కారుదిగారు. కారు పార్క్ చేసి వస్తానని చెప్పిన డ్రైవర్... అటునుంచి అటే పరారయ్యాడు. జితేశ్ ఎంతసేపటికీ రాకపోవటంతో ఉద్యోగులు ఫోన్ చేసినా స్పందించలేదు. పార్కింగ్ ప్రదేశంలో కారు కూడా లేకపోవడంతో నందిగామ ఏసీపీ తిలక్‌కు ఫిర్యాదు చేశారు. భారీ మొత్తంలో బంగారు అభరణాలతో డ్రైవర్ పరార్ కావటంతో బీఎన్‌ఆర్ జ్యూయలర్స్ ప్రతినిధులు సీపీని కూడా కలిసి సంఘటన ను వివరించినట్టు సమాచారం.