BSNL: రూ.1 కే 30 రోజుల వ్యాలిడిటీ ఫ్రీడమ్ ప్లాన్..! ఇక జియో, ఎయిర్ టెల్ పని సరా.!
ABN , Publish Date - Aug 01 , 2025 | 08:31 PM
స్వాతంత్ర్య దినోత్సవ నెలలో బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్‌తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెల రోజులపాటు ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది.

ఇంటర్నెట్ డెస్క్: భారత ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ స్వాతంత్ర్య దినోత్సవ నెలలో అదిరిపోయే ఆఫర్ తో ముందుకొచ్చింది. కేవలం ఒకే ఒక్క రూపాయి ఖర్చుతో నెలరోజుల పాటు, ప్రతిరోజూ 2 జీబీ హై స్పీడ్ డేటా ప్లాన్ తీసుకొచ్చింది. ఆగస్టు 15 సందర్భంగా ఆజాదీ కా ప్లాన్ పేరిట ఈ ఆఫర్ ను పరిచయం చేసింది. సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం 'ఎక్స్' వేదికగా ఈ ప్లాన్ ప్రకటించింది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ ప్లాన్‌లో ఏ నెట్వర్క్‌కు అయినా అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతిరోజూ 100 ఎస్ఎంఎస్ లు కేవలం ఒక్క రూపాయి ఖర్చుతో లభిస్తాయి.
ఈ ఆఫర్ ఆగస్టు 1 అంటే నేటి(శుక్రవారం) నుంచి ఈ నెలాఖరు (31వ తేదీ) వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ తోపాటు సదరు కంపెనీ కొత్త సిమ్ కార్డు కూడా అందిస్తుంది. ఈ ఆఫర్ కేవలం కొత్తగా సిమ్ కొనుగోలు చేసే వారికి మాత్రమే వర్తిస్తుంది. పాత వినియోగదారులకు మాత్రం ఈ ప్లాన్ అందుబాటులో లేదు.
ఇటీవలి కాలంలో ఇతర నెట్ వర్క్ సంస్థలు టెలికాం ధరలను భారీగా పెంచిన సంగతి తెలిసిందే. అయితే, బీఎస్ఎన్ఎల్ మాత్రం రీఛార్జ్ ప్లాన్స్ ధరలను పెంచలేదు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది ప్రైవేట్ దిగ్గజ కంపెనీలకి చెందిన యూజర్లు కూడా బీఎస్ఎన్ఎల్ కు వచ్చి చేరారు. దీంతో దిగ్గజ టెలికాం సంస్థ అయిన జియో భారీగా సబ్ స్క్రిప్షన్ పోగొట్టుకుంది. ఎయిర్ టెల్ కూడా చాలా మంది వినియోగదారుల్ని కోల్పోయింది. ఇక, ఇప్పుడు బ్రహ్మాండమైన ఆఫర్ తో బీఎస్ఎన్ఎల్ ముందుకు రావడం.. రిలయెన్స్ జియో, ఎయిర్ టెల్ లకు మరింత ఇబ్బందికర వాతావరణాన్ని కల్పించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోవూరులో ఉద్రిక్తత.. క్షమాపణలు చెప్పాలంటూ మహిళల డిమాండ్