Pet Dogs: పెంపుడు జంతువులతో జాగ్రత్త..
ABN , Publish Date - Jul 05 , 2025 | 05:02 AM
పెంపుడు కుక్కలు చూడటానికి ఎంతందంగా ఉన్నా, జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కలకూ, వాటిని సాకే వారికీ ప్రమాదమే...

రేబిస్ నివారణకు వ్యాక్సినేషనే మార్గం.. రేపు జూనోసిస్ డే
కృష్ణలంక, జూలై 4 (ఆంధ్రజ్యోతి): పెంపుడు కుక్కలు చూడటానికి ఎంతందంగా ఉన్నా, జాగ్రత్తలు తీసుకోకపోతే కుక్కలకూ, వాటిని సాకే వారికీ ప్రమాదమే. ఇప్పుడు చాలా ఇళ్లలో కుక్కపిల్లలు తిరగడం ఫ్యాషన్‌గా మారింది. కొందరికి వీటిని సాకడం జీవితంలో ఒక భాగమైంది. ప్రేమ, విశ్వాసం చూపడంలో కుక్కలకు సాటిలేదు. అయితే, వాటిపట్ల పరిశుభ్రత, సంరక్షణ విషయాల్లో అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాన్ని కొనితెచ్చినట్లే. ‘జూనోసిస్ డే’ లక్ష్యం జంతువుల నుంచి మ నుషులకు సోకే వ్యాధుల గురించి అవగాహన కల్పించి, వాటిని అరికట్టడం. రేబిస్ వ్యాధికి మందులు లేని సమయంలో శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ ‘యాంటీ రేబి స్’ వ్యాక్సిన్‌ను కనుగొని మహోపకారం చే శారు. అప్పటి నుంచి ప్రతి ఏడాది జూలై 6న ’జూనోసిస్ డే’ జరుపుకుంటున్నాం.
జంతువుల నుంచి సోకే వ్యాధులివే..
జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల్లో రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంథ్రాక్స్ క్షయ, లెప్టోస్పైరోసిస్, మెదడు వాపు, తా మర మొదలైనవి. వీటిలో రేబిస్ అత్యంత ప్రమాదకరం. నివారణ తప్ప చికిత్స లే దు. పిచ్చికుక్కల నుంచి వ్యాపిస్తుంది. ఈ వైరస్ కుక్క ఉమ్మిలో ఉండి, కాటు ద్వారా శరీరంలోకి చేరి వ్యాధిని కలిగిస్తుంది. పుండుపై కుక్క చొంగినా వ్యాధి వచ్చే అవకా శం ఉంది. నెలల్లోనే లక్షణాలు బయటపడతాయి. దీన్ని హైడ్రోఫోబియా అంటారు. ఈ వ్యాధి సోకిన వ్యక్తి గుటకలు వేయలేక, నీళ్లు తాగేటప్పుడు బాధపడతాడు. కుక్క కరిచిన వెంటనే పుండును సబ్బునీళ్లతో కడిగి, డాక్టరును సంప్రదించి టీకాలు వేయించుకోవాలి. మెదడు వాపు జపనీస్ ఎన్‌సెఫలైటిస్ వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ దోమల ద్వారా పందుల నుంచి మనుషులకు వ్యాపిస్తుంది.
మురుగునీరు నిల్వ లేకుండా చేయడం, పందుల పెంపకాన్ని దూరంగా చేపట్టడంతో నివారించవచ్చు. ఆంథ్రాక్స్ బేసిల్లస్ ఆంథ్రసిస్ బాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధిగ్రస్థ జంతువుల మాంసం తినడం, గొర్రెల ఉన్ని ద్వారా వ్యాధి సోకుతుంది. వ్యాధిగ్రస్థ మాంసం తినకుండా ఉంటే నివారించవచ్చు. బ్రూసెల్లోసిస్ బ్రూసెల్లా బాక్టీరియా వల్ల వస్తుంది. గర్భస్రావ పిండాన్ని జాగ్రత్తలు లేకుండా తీసివేయడం, పశువులతో సన్నిహితంగా ఉండటం, వ్యాధిగ్రస్థ పశువుల పచ్చిపాలు తాగడం ద్వారా సోకుతుంది. పశువులకు దూరంగా ఉండటం, పాలను కాచి తాగడం ద్వారా నివారించవచ్చు. క్షయ మైకోబాక్టీరియం బాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాధిగ్రస్థ పశువుల మల, మూత్రం, ఉమ్మితో కలుషితమైన ఆహారం, పాలు తీసుకోవడం ద్వారా సోకుతుంది. వ్యాధిగ్రస్థ పశువులను వేరుచేయడం ద్వారా నివారించవచ్చు. లెప్టోస్పైరోసిస్ లెప్టోస్పైరా బాక్టీరియా వల్ల, కుక్కల మూత్రం ద్వారా కలుషితమైన నీరు తాగడం వల్ల వస్తుంది. పెంపుడు కుక్కలకు టీకాలు వేయడం ద్వారా నివారించవచ్చు.
జాగ్రత్తలు పాటించండి
డాక్టర్ కామని శ్రీనివాసరావు
పెంపుడు కుక్కల యజమానులు పా టించాల్సిన జాగ్రత్తలను పశుసంవర్థక శాఖ అసిస్టెంట్ డైరె క్టర్ డాక్టర్ కామని శ్రీనివాసరావు వివరించారు. కుక్కలుం డే ప్రదేశాన్ని క్రిమిసంహారక ద్రావణం తో శుభ్రపరచాలన్నారు. మాంసం, చేపలు ఉడకబెట్టి వాడాలని, కుక్కలను తాకిన తర్వాత చేతులు క్రిమిసంహారక ద్రావణంతో కడగాలన్నారు. వ్యాధిగ్రస్థ కుక్కలను ఆరోగ్యవంతమైన కుక్కలకు, పిల్లలకు దూరంగా ఉంచాలలన్నారు. వ్యాధుల నివారణకు రెగ్యులర్ టీకాలు వేయించాలని, నట్టల నివారణ మందు క్రమం తప్పకుండా వేయించాలని తెలిపారు. జూనోసిస్ డే సందర్భంగా జూ లై 6న అన్ని ప్రభుత్వ పశువుల ఆస్పత్రుల్లో కుక్కలకు ఉచిత రేబిస్ వ్యాక్సిన్ లు వేస్తారని డాక్టర్ కామని శ్రీనివాసరావు తెలిపారు. పశుపోషకులు, పెంపు డు కుక్కల యజమానులకు వ్యాధులపై అవగాహన శిబిరం ద్వారా చైత న్యం కల్పిస్తామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.