Share News

Murder in Guntur: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయల కత్తితో..

ABN , Publish Date - Oct 14 , 2025 | 01:52 PM

గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్‌ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు.

Murder in Guntur: పట్టపగలే నడిరోడ్డుపై దారుణ హత్య.. కొబ్బరికాయల కత్తితో..
Guntur Murder

గుంటూరు, అక్టోబర్ 14: ఆంధ్ర ప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తెనాలి చెంచుపేటలో ఇవాళ దారుణం జరిగింది. పట్టపగలే నడిరోడ్డుపై వ్యక్తి హత్యకు గురయ్యాడు. కైలాష్ భవన్ రోడ్డులో టిఫిన్ సెంటర్ వద్ద కొబ్బరికాయల కత్తితో జ్యూటూరి బుజ్జి(50) అనే వ్యక్తిని దుండగుడు నరికి చంపారు. సమాచారం అందుకున్న త్రీటౌన్ పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. దుండగుడు స్కూటీపై మాస్క్‌ వేసుకొని వచ్చి హత్య చేసి పరార్ అయినట్టు స్థానికులు చెబుతున్నారు. మృతుడు అమర్తులూరు మండలం కోడితాడిపర్రు గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. చెంచుపేటలో కూతురి ఇంటికి వచ్చి బుజ్జి.. టిఫిన్ చెయ్యటానికి బయటకు వెళ్ళాడు. ఈ క్రమంలోనే దుండగులు అతనిపై ఘోరంగా దాడి చేసి చంపేశారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం సమాచారం తెలియాల్సి ఉంది.


అటు కృష్ణా జిల్లా విజయవాడలో ఇవాళ మరో విషాద ఘటన జరిగింది. గంజాయి మత్తులో అపార్ట్ మెంట్ పైనుంచి ఓ వ్యక్తి దూకాడు. వాంబేకాలనీ జీ ప్లస్ త్రీ అపార్ట్ మెంట్స్ వద్ద ఈ ఘటన జరిగింది. బిల్డింగ్ పై నుంచి దూకడంతో సదరు వ్యక్తికి తీవ్రగాయాలు అయ్యారు. దీంతో ఆయన్ను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి:

Bengaluru News: డ్రాప్‌ చేస్తామని చెప్పి... రేప్‌ చేశారు..

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. మాగంటి సునీత, అక్షరపై కేసు నమోదు

Updated Date - Oct 14 , 2025 | 01:55 PM