Share News

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:58 AM

ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు ఏపీయూడబ్ల్యూజే నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక గురువారం సాయంత్రం జరిగింది.

I.V. Subbarao: ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గం

  • అధ్యక్షునిగా ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా జయరాజ్‌

ఒంగోలు కల్చరల్‌, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌ జర్నలిస్టు(ఏపీయూడబ్ల్యూజే) నూతన రాష్ట్ర కార్యవర్గ ఎన్నిక గురువారం సాయంత్రం జరిగింది. ఒంగోలులో జరుగుతున్న యూనియన్‌ మహాసభల ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షునిగా ఐ.వి.సుబ్బారావు, ప్రధాన కార్యదర్శిగా అమరావతికి చెందిన కంచల జయరాజ్‌ను ఎన్నుకున్నారు.


అదే విధంగా నలుగురు ఉపాధ్యక్షులు కె.స్వాతిప్రసాద్‌ (కాకినాడ జిల్లా), కె.మాణిక్యరావు (ఏలూరు జిల్లా), చావా రవి (కృష్ణా అర్బన్‌), జి.కొండప్ప (కర్నూ లు జిల్లా)ను ఎన్నుకున్నారు. కోశాధికారిగా నెల్లూరు జిల్లాకు చెందిన వల్లూరు వెంకటేశ్వర్లు, కార్యదర్శులుగా సీహెచ్‌బీఎల్‌. స్వామి (అనకాపల్లి), విద్యాధరణి మురళి(పల్నాడు), ఏ.సురేష్‌ (ప్రకాశం), ఎంపీఆర్‌ రాజు (తిరుపతి)లను ఎన్నుకున్నారు. అదే వి ధంగా పలు జిల్లాల నుంచి 15 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.

Updated Date - Jun 27 , 2025 | 05:58 AM