Lawyers: లాయర్లకు 4.42 కోట్లు మంజూరు
ABN , Publish Date - Jul 03 , 2025 | 06:41 AM
న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ
అమరావతి, జూలై 2(ఆంధ్రజ్యోతి): న్యాయవాదుల డెత్ బెనిఫిట్స్, వైద్య ఖర్చులు, పదవీ విరమణ ప్రయోజనాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు సమావేశమైన ఏపీ న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. బార్ కౌన్సిల్ చైౖర్మన్ నల్లారి ద్వారకానాథ్‌రెడ్డి అధ్యక్షతన ఇటీవల జరిగిన న్యాయవాదుల సంక్షేమ నిధి కమిటీ సమావేశంలో సభ్యులు ముప్పాళ్ల సుబ్బారావు, పి.నరసింగరావు, ఏపీ హైకోర్టు, న్యాయశాఖ ప్రతినిధులు హాజరయ్యారు.
ఇటీవల మరణించిన 75 మంది న్యాయవాదుల కుటుంబ సభ్యులకు రూ.3.77 కోట్లు, వైద్య ఖర్చుల నిమిత్తం 85 మంది న్యాయవాదులకు రూ.50.40 లక్షలు, పదవీ విరమణ ప్రయోజనం కింద 5గురు న్యాయవాదులకు రూ.15 లక్షలు మొత్తం రూ.4.42 కోట్లు మంజూరు చేసింది. అలాగే న్యాయవాదుల గుమస్తాల సంక్షేమ నిధి నుండి క్లర్కులు, వారి కుటుంబాలకు రూ.51.82 లక్షలు మంజూరు చేశారు.