Share News

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు

ABN , Publish Date - Jul 18 , 2025 | 05:43 AM

పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది..

Andhra School Education: పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు
Andhra School Education

  • రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో ఏర్పాటుకు ఆదేశాలు

అమరావతి, జూలై 17 (ఆంధ్రజ్యోతి): పాఠశాల విద్య బలోపేతానికి అకడమిక్‌ ఫోరంలు ఏర్పాటు చేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిల్లో వీటి ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. అకడమిక్‌ అంశాల్లో మార్గనిర్దేశనం, సామర్థ్యాల పెంపు, అభ్యసన ఫలితాల మెరుగుదలకు జవాబుదారీతనం తదితర అంశాలను ఇవి పర్యవేక్షించనున్నాయి. రాష్ట్రస్థాయి ఫోరానికి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చైర్‌పర్సన్‌గా, ఎస్‌సీఈఆర్‌, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్లు, కేజీబీవీ కార్యదర్శి, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. ఈ ఫోరం వ్యూహాత్మక దిశానిర్దేశం, అకడమిక్‌ గైడెన్స్‌ అంశాలను పర్యవేక్షిస్తుంది. జిల్లా ఫోరంలో డీఈవో చైర్‌పర్సన్‌గా, సమగ్రశిక్ష ఏపీసీ, డైట్‌ ప్రిన్సిపాల్‌, డీసీఈబీ కార్యదర్శి, అకడమిక్‌ మానిటరింగ్‌ ఆఫీసర్‌, ఇతర అధికారులు సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి బృందాలను సమన్వయం చేస్తూ అకడమిక్‌ అంశాల్లో ఈ కమిటీలు సూచనలు చేస్తాయి. ఇక మండల స్థాయి ఫోరానికి ఎంఈవో-1 చైర్‌పర్సన్‌గా, ఎంఈవో-2, క్లస్టర్‌ కాంప్లెక్స్‌ చైర్‌పర్సన్లు, సబ్జెక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ టీచర్లు సభ్యులుగా ఉంటారు. విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్‌, నకిలీ నమోదుల తొలగింపు, విద్యార్థి వరుసగా గైర్హాజరైతే ఇంటికి వెళ్లి ఆరా తీయడం వంటి బాధ్యతలను కూడా ఈ ఫోరాలు పర్యవేక్షించాలి.

ఈ వార్తలు కూడా చదవండి:

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

Heavy Rains: భారీ వర్షం.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన వాహనాలు..

CM Vs KTR: కేటీఆర్ మిత్రుడు దుబాయ్‌లో చనిపోయాడు: సీఎం రేవంత్

Updated Date - Jul 18 , 2025 | 05:43 AM