AP Cabinet: క్యాబినెట్ భేటీలో చర్చించే అంశాలివే..
ABN , Publish Date - May 19 , 2025 | 09:09 PM
ఏపీ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

అమరావతి: ఏపీ సచివాలయంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఈ క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ భేటీలో సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఎస్‌ఐపీబీ(SIPB) 6వ సమావేశంలో అమోదించిన పలు సంస్థల ప్రతిపాదనలను ఆమోదించనున్నట్లు తెలుస్తోంది. 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులను మంత్రి వర్గం ఆమోదించున్నారని సమాచారం. పోలవరం - బనకచర్ల ప్రాజెక్ట్‌కు పాలన పరమైన అనుమతులకు అమోదం పైనా క్యాబినెట్లో చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ నేపధ్యంలోనే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తి కావస్తున్న సందర్భంగా రాష్ట్ర అభివృద్దిపై చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చ జరగనుంది. ఈ ఏడాదిలో అమలు చేసిన అభివృద్ది, సంక్షేమం, పారిశ్రామిక వృద్దిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసే అంశంపై కీలక చర్చలు చేయనున్నారు. అలాగే, ఉద్యోగుల బదిలీలపై కూడా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే పలు సంస్థలకు భూ కేటాయింపులు చేయనున్నారని సమాచారం.
Also Read:
Varla Ramaiah: సిట్ విచారణతో వైసీపీ నేతలకు తడిసిపోతుంది..
Pawan Kalyan: వారిపై స్పెషల్ ఫోకస్ పెట్టండి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లేఖ..
CM Chandrababu: సీఎం చంద్రబాబుకు బిల్‌గేట్స్ లేఖ.. ఎందుకంటే