Share News

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం

ABN , Publish Date - Apr 20 , 2025 | 07:11 PM

Minister Narayana: రెండు రోజుల పర్యటనలో భాగంగా ఏపీ మంత్రి పి. నారాయణతోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. అందులోభాగంగా పలు ప్రాంతాలను సందర్శిస్తోంది.

Minister Narayana: గుజరాత్‌లో పటేల్ విగ్రహాన్ని పరిశీలించిన మంత్రి నారాయణ బృందం
Minister P Narayana

అమరావతి, ఏప్రిల్ 20: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణపు పనులు వేగం పుంజుకొంటున్నాయి. అలాంటి వేళ అమరావతి నిర్మాణంలో భాగంగా రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణతోపాటు ఉన్నతాధికారుల బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. ఆదివారం ఆ రాష్ట్రంలోని ఏక్తా నగర్‌లో సర్దార్ వల్లభాయి పటేల్ భారీ విగ్రహాన్ని మంత్రులు, ఉన్నతాధికారులు పరిశీలించారు. ఆ క్రమంలో పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉపయోగించిన సాంకేతికతతోపాటు మెటీరియల్.. ఇతర అంశాలను నిర్మాణ సంస్థ ప్రతినిధులు, గుజరాత్ ఉన్నతాధికారులు.. మంత్రి నారాయణ బృందానికి సోదాహరణగా వివరించారు.


అనంతరం అహ్మదాబాద్ శివారులో ఇంటర్నేషనల్ ఎకనామిక్ సిటీగా 860 ఎకరాల్లోసెజ్‌లు, కంపెనీలతో నిర్మించిన గిఫ్ట్ సిటీని ఈ బృందం సందర్శించింది. అమరావతిలో నిర్మించే భారీ విగ్రహాల కోసం పటేల్ విగ్రహ నిర్మాణాన్ని మంత్రి నారాయణ,సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు, ఏడీసీ చైర్ పర్సన్ లక్ష్మీ పార్థసారథి భాస్కర్‌తోపాటు గ్రీనింగ్ కార్పొరేషన్ ఎండీ శ్రీనివాసులు తదితర బృందం అధ్యయనం చేసింది.


గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి ఏపీ ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించిన పనుల్లో వేగం పెరిగింది. అయితే అమరావతి పునర్ నిర్మాణ పనులకు మే 2వ తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అందుకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతోన్నాయి.


అందులోభాగంగా భవన నిర్మాణాలతోపాటు భారీ భవంతులు, విగ్రహాల ఏర్పాటు చేయనున్నారు. అలాగే నిర్మాణ పనులు ఏ విధంగా చేపట్టాలి. ఎలా ముందుకు వెళ్లాలనే అంశాలపై మంత్రి నారాయణ బృందం గుజరాత్‌లో పర్యటిస్తోంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆది, సోమవారాల్లో ఈ బృందం గుజరాత్‌లో పర్యటించనుంది.


అదీకాక.. ఈ ఎన్నికల్లో గెలుస్తే.. రాజధాని అమరావతి నిర్మాణంతోపాటు రాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని ఎన్నికల ప్రచారం వేళ.. ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. రాష్ట్రప్రజలకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇది కూడా చదవండి..

YSRCP: అధికారం కోల్పోయినా.. అరాచకాలు ఆగలేదు

10th class Students: సార్, ఛాయ్‌ తాగండి, నన్ను పాస్‌ చేయండి

CM Chandrababu: టీ 20 మ్యాచెస్ ఎంత ఇంట్రెస్ట్‌గా ఉంటాయో.. అసెంబ్లీ సమావేశాలు..

CM Chandrababu Birthday: సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో అపశృతి

For Andhrapradesh News And Telugu News

Updated Date - Apr 20 , 2025 | 07:12 PM