Nara Lokesh: జగన్.. మీ కడుపుమంట చూస్తే జాలేస్తోంది: నారా లోకేష్
ABN , Publish Date - Jun 15 , 2025 | 10:16 PM
తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు.. అంటూ నారా లోకేష్..

అమరావతి: 'తల్లికి వందనం' కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ఘన విజయం సాధించడం, ఎంతమంది పిల్లలుంటే అంత మంది చిన్నారులకి ఒక్కక్కరికి పదిహేను వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమకావడం జరిగింది. దీంతో ఏపీలో తల్లుల కళ్లలో ఆనందం తొణికిసలాడుతుండటం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌లో మరింత ఉత్సాహాన్ని నింపినట్టుంది. ఈ పథకం గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ పార్టీ వ్యాఖ్యల్ని రెండు రోజులుగా తీవ్రంగా ఖండిస్తున్న నారా లోకేష్ ఇవాళ మరో అడుగు ముందుకేశారు. ఫన్నీ.. ఫన్నీ సెటైర్లతో వైసీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి చురకలంటించారు. ఈ మేరకు లోకేష్ తన ఎక్స్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో లోకేష్ ఏమన్నారంటే..
'తల్లికి వందనం సూపర్ సక్సెస్! తల్లుల కళ్లలో ఆనందం చూసి జగన్ రెడ్డి గారి కడుపు మంట మూడింతలు పెరిగింది. మరోసారి తన విష పత్రికలో ఫేక్ ప్రచారానికి తెరలేపారు. ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం, లేదా వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేసిన తరువాత మాత్రమే వారికి నిధులు విడుదల అవుతాయి.. దొంగ లెక్కలు, డబ్బులు కొట్టేయడం మీ బ్రాండ్ జగన్ రెడ్డి గారు. మీ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలే అందరూ చేస్తారు అనుకుంటే ఎలా? మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం..చెయ్యనివ్వం. జగన్ రెడ్డి గారూ కడుపు మంటగా ఉన్నట్టుంది. రెండు ఈనో ప్యాకెట్లు పంపిస్తాను వాడండి.. కాస్త తగ్గుద్ది.' అంటూ సెటైర్లు వేశారు మంత్రి నారా లోకేష్.
ఇవి కూడా చదవండి:
విమాన ప్రమాదంలో మృతదేహాలకు డిఎన్ఎ పరీక్షలు
19న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర: ఇస్రో
For More AP News and Telugu News