AP Governor: చదువంటే డిగ్రీలు, బట్టీ పట్టడం కాదు: గవర్నర్ అబ్దుల్ నజీర్
ABN , Publish Date - Jul 04 , 2025 | 09:04 PM
Abdul Nazeer JNTU Kakinada: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ జేఎన్టీయూ కాకినాడ 11వ స్నాతకోత్సవానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేయడంతో పాటు వారిని ఉద్దేశించి ప్రసంగించారు.

కాకినాడ: ఏపీ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కాకినాడ జేఎన్టీయూ 11వ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్సిటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ఆయన అవార్డులు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ చదువంటే డిగ్రీలు, బట్టీ పట్టడం, 100 కి 100 మార్కులు సాధించడం కాదని ఆయన అన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తయింది అంటే ఇంతటితో విద్య పూర్తయినట్లు కాదని.. ఇదే మీ కలలను సాకారం చేసుకునేందుకు ఆరంభమని చెప్పారు. యువత ధైర్యంగా, విభిన్నంగా ఆలోచించాలని.. సమస్యలను ఎదుర్కొని విజయబావుటా ఎగరేయాలని సూచించారు.
' సరికొత్త బోధనా పద్ధతులతో డిజిటల్ ప్లాట్ ఫాంను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత విశ్వవిద్యాలయాదే. క్వాంటమ్ కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐఓటి, ఇ-మొబిలిటీ వంటి సాంకేతికతను మరింత ముందుకు తీసుకువెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2026 నాటికి దేశంలోనే మొట్ట మొదటి పూర్తిస్థాయి స్టాక్ క్వాంటమ్ వ్యాలీని స్థాపించనుంది. క్వాంటమ్ మిషన్ వలన 2026 కల్లా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు ద్వారా అమరావతిలో ఆవిష్కరణలు, ఉన్నతస్థాయి ఉపాధి, పర్యావరణ స్థిరత్వాన్ని పెంపొందించేందుకు అవకాశం లభిస్తుంది. సాఫ్ట్ స్కిల్స్, వ్యవస్థాపకత, పరిశ్రమలతో అనుసంధానమై సిలబస్ ను రూపొందించడం ద్వారా పట్టభద్రులు సవాళ్లను ఎదుర్కొనేలా తయారుచేయవచ్చు' అని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంలో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
మద్యం స్కామ్‌లో పెరిగిన నిందితుల సంఖ్య
Read latest AP News And Telugu News