Share News

Actress Pakeezah: సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:32 PM

ప్రముఖ నటి పాకీజా ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతోపాటు ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఆమె పరిస్థితి చూసి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఈ నేపథ్యంలో ఆమెను అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయానికి తీసుకెళ్లారు.

Actress Pakeezah: సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
Actress pakeezah

అమరావతి, జులై 01: టాలీవుడ్ నటి వాసుకి అలియాస్ పాకీజాకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం చేశారు. అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆమెకు పవన్ కల్యాణ్ తరఫున ఆ పార్టీ నేతలు రూ. 2 లక్షల చెక్కును అందజేశారు. అనంతరం పాకీజా మాట్లాడుతూ.. తనను ఆర్థికంగా ఆదుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు సినీ నటి వాసుకి అలియాస్ పాకీజా కృతజ్ఞతలు తెలిపారు. చిన్నవాడైనా పవన్ కల్యాణ్ ఎదురుగా ఉంటే.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ ఆమె ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. పవన్ కల్యాణ్ కుటుంబానికి తాను రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించిన పాకీజా ప్రస్తుతం తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


తనకు ఆర్థిక సహాయం అందించాలంటూ సదరు వీడియోల్లో ఆమె వేడుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె దీనస్థితిని చూసి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. ఆ క్రమంలో పాకీజాను మంగళవారం నాడు అమరావతిలోని జనసేన పార్టీ కార్యాలయానికి నేతలు తీసుకెళ్లారు. అనంతరం పవన్ కల్యాణ్ తరఫున రూ. 2లక్షల చెక్కును ఎమ్మెల్సీ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆమెకు అందజేశారు.


1,990వ దశకంలో పలు టాలీవుడ్ చిత్రాల్లో వాసుకీ నటించారు. అయితే అసెంబ్లీ రౌడీ చిత్రంలో ఆమె పాకీజా పాత్రలో నటించగా.. మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. అయితే ఆమె ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్.. ఆమెకు ఆర్థికసాయం అందించాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రూ.2లక్షలు అందజేశారు.


ఇవి కూడా చదవండి:

రెండు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు

త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర

ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..

For More AP News and Telugu News

Updated Date - Jul 01 , 2025 | 04:29 PM