CID Recruitment: ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
ABN , Publish Date - Apr 29 , 2025 | 05:31 AM
ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీైంది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు మే 1 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు

మే 1 నుంచి దరఖాస్తులు.. కంప్యూటర్, డ్రైవింగ్ తప్పనిసరి
అమరావతి, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): ఏపీ సీఐడీలో 28 హోంగార్డు పోస్టుల భర్తీకి పోలీసు శాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 18 నుంచి 50 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారు అర్హులు. పురుష అభ్యర్థులు 160, మహిళా అభ్యర్థులు 150సెం.మీ.. ఎత్తు ఉండాలి. ఎస్‌టీ మహిళలకు 5సెం.మీ సడలింపు ఉంటుంది. దరఖాస్తుదారులకు కంప్యూటర్ పరిజ్ఞానం, లైట్, హెవీ మోటారు వాహన డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. మే 1నుంచి 15వరకూ దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తులు.. ఏపీ పోలీస్ సీఐడీ వెబ్‌సైట్ https://cid.appolice.gov.in లో అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు కంప్యూటర్, టైపింగ్, డ్రైవింగ్ పరీక్ష నిర్వహించి తుది ఎంపిక చేస్తామని సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ తెలిపారు. వివరాల కోసం 94407 00860 నంబర్‌కు ఆఫీసు పనివేళల్లో సంప్రదించవచ్చన్నారు.
ఇవి కూడా చదవండి
Guntur Mayor Election: గుంటూరు మేయర్ ఎన్నిక.. వైసీపీ అభ్యర్థి నామినేషన్
Visakhapatnam Mayor: విశాఖ మేయర్ ఎన్నిక ఏకగ్రీవం
Read latest AP News And Telugu News