Share News

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

ABN , Publish Date - Nov 01 , 2025 | 01:16 PM

ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు పట్టణంలో 70, మండలంలో 39 రేషన్‌ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు.

AP News: రేషన్‌ షాపుల్లో డీలర్ల మాయాజాలం...

- బహిరంగ దోపిడీ

గుంతకల్లు(అనంతపురం): ప్రతి నెలా కొందరు డీలర్లు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నారు. గుంతకల్లు(Gunthakal) పట్టణంలో 70, మండలంలో 39 రేషన్‌ షాపులు ఉన్నాయి. దాదాపు 42 వేల కార్డులు ఉన్నాయి. పలు రేషన్‌ దుకాణాల్లో బియ్యంతో పాటు సుమారు ఒకటిన్నర కిలోల బరువున్న డబ్బాను ఉంచి.. తూకం వేసి లబ్ధిదారులకు వేస్తున్నారు. 20 కేజీల బియ్యాన్ని ఒకసారి ఇలా తూకం వేసి ఇస్తారు. కార్డులకు 35 కేజీల బియ్యం ఇవ్వాల్సి వస్తే.. రెండు సార్లు తూకం వేసి ఇస్తారు. అంటే అప్పుడు మొత్తం మూడు కేజీల బియ్యాన్ని తక్కువగా ఇస్తారు.


pandu2.3.jfif

దీనిపై లబ్ధిదారులు ప్రశ్నిస్తే.. స్టాక్‌ పాయింట్‌లో వంద కేజీల ప్యాకెట్‌కు తూకం తక్కువ వస్తుందని, ప్రతి నెలా అధికారులకు మామూళ్లు ఇస్తున్నామని.. డీలర్లు దబాయిస్తున్నారు. ఇలా డీలర్లు ప్రతి కార్డు మీద బియ్యాన్ని దోపిడీ చేస్తూ... ప్రతినెలా రూ. లక్షలు దండుకుంటున్నారు. ఇలా వీరు బహిరంగ దోపిడీకి పాల్పడుతున్నా.. రెవెన్యూ, తూనికల శాఖల అధికారులు చోద్యం చూస్తున్నారే తప్పా.. ఏ మా త్రం చర్యలు తీసుకోవడం లేదు. దీనిపై ఫిర్యాదు చేస్తేనే తాము స్పందిస్తామని వారు తెగేసి చెబుతున్నారు. ఈ విషయంపై తహసీల్దార్‌కు వివరణ కోరేందుకు ఫోన్‌ చేయగా లిఫ్ట్‌ చేయలేదు.


pandu2.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 01 , 2025 | 01:22 PM