Andhra Pradesh Pensions: పెన్షన్ పంపిణీ లబ్దిదారులకు కొత్త టెన్షన్..
ABN , Publish Date - Feb 28 , 2025 | 10:36 AM
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అనర్హులను పెన్షన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోన్న సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు.

Andhra Pradesh Pensions: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికీ పెన్షన్ ఇచ్చేలా సేవలను అందిస్తోంది. ప్రతీ నెలా 1వ తేదీ రాగానే రాష్ట్రంలో పెన్షన్ సందడి మొదలవుతుంది. అయితే, మార్చి 1న కొంతమంది లబ్దిదారులు తమకు పెన్షన్ వస్తుందో రాదో అని టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఏపీ సర్కార్ అనర్హులను పెన్షన్ లబ్దిదారుల జాబితా నుంచి తొలగిస్తోంది. అందువల్ల తమకు డబ్బులు ఇస్తారో, ఇవ్వరోనని పెన్షన్ పొందుతున్న వారిలో కొంతమంది టెన్షన్ పడుతున్నారు.
ప్రభుత్వ లెక్క ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 63,59,907 మంది పెన్షనర్లు ఉన్నారు. వీరిలో ఫిబ్రవరి నెలలో 62,43,844 మంది పెన్షన్ తీసుకున్నారు. మిగిలిన 1,16,063 మంది పెన్షన్ తీసుకోలేదు. అయితే, వీరికి ఎందుకు పెన్షన్ ఇవ్వలేదో ఇప్పటి వరకు తెలియలేదు. వారిికి అర్హత లేదని ఇవ్వలేదా? లేదా వారు అందుబాటులో లేకపోవడం వల్ల ఇవ్వలేదా? లేదా చనిపోవడం వల్ల ఇవ్వలేదా? ఇలా ఎన్నో సందేహాలు ఉన్నాయి. అయితే, కారణం ఏదైనా కూడా ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్‌ను ఇంతమంది పొందకపోవడం ఆశ్చర్యకరం. మరి మార్చిలో ఎంత మందికి పెన్షన్ ఇస్తారు? ఎవరి పేర్లు అయినా తొలగించారా అనేది రేపు తెలుస్తుంది.
ప్రభుత్వం మాత్రం పెన్షన్‌కు ఎవరు అనర్హులు, ఎవరు అర్హులు అనేది.. ఇటీవల రీ-అసెస్‌మెంట్ వైకల్య పరీక్షలతో తేల్చుతున్నారు. ఈ పరీక్షల్లో వైకల్యం లేదని తెలిస్తే మాత్రం పెన్షన్ ఇవ్వరు. అందువల్ల కొంతమంది తమకు పెన్షన్ ఇస్తారో లేదో అని టెన్షన్ పడుతున్నారు. మార్చి 1, 3న ఎవరికైనా కూడా పెన్షన్ రాకపోతే, వారు మార్చి 4న సచివాలయ ఉద్యోగులకు కాల్ చేసి పెన్షన్ గురించి అడగవచ్చ. తద్వారా ఉద్యోగులు మళ్లీ ఓసారి పరిశీలించి వారికి పెన్షన్ అందజేస్తారు. ఒకవేళ అనర్హులైతే మాత్రం వారికి ఇవ్వరు.
Also Read:
రూ.3 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్..