VHP : హిందువులపై దాడులను ఉపేక్షించం
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:00 AM
హిందువులపై ఎక్కడ దాడి జరిగినా విశ్వ హిందూ పరిషత(వీహెచపీ) ఇక ఉపేక్షించదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఊరే గింపులో హిందువులపై ముస్లింల దాడిని నిరసిస్తూ సోమవారం వీహెచపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా వందలాదిమందితో కృష్ణ కళామందిర్ నుంచి క్లాక్‌టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా కలెక్ట రేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

- ఎస్‌ఐ నరసింహారెడ్డి, ఈఓ రమణారెడ్డిని డిస్మిస్ చేయాలి
- రాయచోటి ఘటనపై డిప్యూటీ సీఎం స్పందించాలి
- విశ్వహిందూ పరిషత నిరసన ర్యాలీలో వక్తలు
అనంతపురం కల్చరల్, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): హిందువులపై ఎక్కడ దాడి జరిగినా విశ్వ హిందూ పరిషత(వీహెచపీ) ఇక ఉపేక్షించదని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాయచోటిలో వీరభద్రస్వామి పార్వేట ఊరే గింపులో హిందువులపై ముస్లింల దాడిని నిరసిస్తూ సోమవారం వీహెచపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త నిరసనలో భాగంగా వందలాదిమందితో కృష్ణ కళామందిర్ నుంచి క్లాక్‌టవర్, సప్తగిరి సర్కిల్, పాతూరు మీదుగా కలెక్ట రేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ వినోద్ కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. నిరసన ర్యాలీలో వీహెచపీ జిల్లా అధ్యక్షుడు తాళంకి వెంకట రత్నమయ్య, భజరంగదళ్ దక్షిణాంధ్ర సహాయ సంయోజక్ రవి, బీజేపీ నాయకులు కొనకొండ్ల రాజేష్, సందిరెడ్డి శ్రీనివాసులు, చిరంజీవిరెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...
ఈనెల 4న రాయ చోటిలో వీరభద్రస్వా మి పార్వేట ఉత్సవంలో హిందువులపై అన్యమతస్థుల దాడి హిందూ మనో భావాలను దెబ్బతీసేలా ఉన్నాయన్నారు. రథోత్సవమంటేనే మేళతాలాలు, ఊరేగింపులతో జరిగే కార్యక్రమమని, అలాంటి కార్యక్రమాలకు అడ్డు తగిలి దాడి చేసి హిందువులను భయ బ్రాంతులకు గురిచేయడం దురదృష్టకరమ న్నారు. అక్కడున్న పోలీస్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడమే కాకుండా హిందువులపైనే కేసులు నమోదు చేసి, అన్యమతస్థులను మా త్రం నామమాత్రపు కేసులతో విడుదల చేశారన్నారు. ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్‌ఐ నరసింహారెడ్డి, వీరభద్రస్వామి ఆలయ ఈఓ రమణా రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రా యచోటి ఘటనపై డిప్యూటి సీఎం పవన కళ్యాణ్ స్పందించాలని, హిందువు లకు న్యాయం చేసి హిందూ సమాజ భద్రతను కాపాడాలని కోరారు. ఈ కా ర్యక్రమంలో ప్రభుత్వాస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు ఓలేటి రత్నమయ్య, వీహెచపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణబాబు, కార్యదర్శి విశ్వనాతరెడ్డి, సహా య కార్యదర్శి కిషోర్ నాయుడు, భజరగందళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....