Waterfall : జలపాతం కోనవిందు..!
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:34 AM
యాడికి మండలంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. నంద్యాల జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొండలపై నుంచి ...
యాడికి మండలంలోని కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద జలపాతం కనువిందు చేస్తోంది. నంద్యాల జిల్లా సరిహద్దుల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వర్షపునీరు కోన రామలింగేశ్వరస్వామి ఆలయం వద్ద ఉన్న కొండలపై నుంచి దూకుతోంది. ఏటా వర్షాకాలంలో జీవం పోసుకునే ఈ జలపాతం.. ఈ ఏడాది కాస్త ఆలస్యంగా జలకళను సంతరించుకుంది. మరో మూడు
నెలలపాటు నీరు పారే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. యాడికి మండల కేంద్రం నుంచి 15 కి.మీ. దూరంలో ఉన్న ఈ జలపాతం వద్దకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం బాగుంది. వాహనాలు సొంతంగా తీసుకువెళ్లాల్సిందే. జలపాతాన్ని చూసేందుకు ఉమ్మడి అనంత, కర్నూలు, కడప జిల్లాల నుంచి పర్యాటకులు తరలివస్తారు.
-ఆంధ్రజ్యోతి, యాడికి
మరిన్ని అనంతపురం వార్తల కోసం..