Petrol and Diesel Tampering: పెట్రోల్, డీజిల్ కొట్టిస్తున్నారా.. మిమల్ని నిలువునా ముంచేస్తారు.. జర జాగ్రత్త
ABN , Publish Date - Mar 07 , 2025 | 08:36 PM
మీ బండిలో కొట్టిస్తున్న పెట్రోల్‌లో మోసం జరుగుతున్నా.. మీకు తెలియడం లేదా.. లీటరు పెట్రోల్‌కు ఎంత తక్కువ వస్తుంది. బాటిల్‌లో కొట్టించినప్పుడు, వాహనాల్లో కొట్టించినప్పుడు జరుగుతున్న తేడాను గమనిస్తున్నారా.. అసలు పెట్రోల్ బంకుల్లో ఎలాంటి మోసం జరుగుతోంది.

మీ వాహనంలో పెట్రోల్, డీజిల్ పోయించుకునేందుకు పెట్రోల్ అవుట్‌లెట్‌కు వెళ్తున్నారా.. ఒక లీటరు పెట్రోల్ పోయమని అడుగుతున్నారా.. వెంటనే పెట్రోల్ పోసే వ్యక్తి జీరో చూసుకోమని మరీమరీ చెబుతున్నారా.. పెట్రోల్ మీటర్ చూసి.. ఓకే చెప్పగాన రీడింగ్ మొదలవుతుంది. లీటర్ పెట్రోల్ రీడింగ్‌లో చూపించగానే పెట్రోల్ గన్ మీ ట్యాంకర్ నుంచి తీసేస్తారు. లీటర్ పెట్రోల్ పోయించాము కదా.. ఇక హ్యాపీగా తిరిగేయొచ్చనుకుంటే మీరు మోసపోయినట్లే.. లీటరు పెట్రోల్ కొట్టించుకుంటే 1000 ఎంఎల్ వచ్చినట్లు రీడింగ్ మీటరల కనపడొచ్చు.. కానీ ఒక లీటర్‌కు 100 ఎంఎల్ పెట్రోల్, డీజిల్ తగ్గేలా కొన్ని పెట్రోల్ అవుట్‌లెట్స్‌లో ట్యాంపరింగ్ చేస్తున్నారట. అనంతపురం జిల్లాలో పెట్రోల్ అవుట్‌లెట్స్‌లో తనిఖీలు చేస్తున్న అధికారులు పెట్రోల్, డీజిల్‌లో ట్యాంపరింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించారట. పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ వార్తలు గతంలోనూ వచ్చాయి. మరోవైపు పెట్రోల్‌లో కల్తీ చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇటీవల కాలంలో సాంకేతికత పెరగడంతో ట్యాంపరింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్న ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో ట్యాంపరింగ్ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం.
చిప్‌లు మార్చి..
టెక్నాలజీ పెరిగిన తర్వాత మోసాలు పెరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల్లో ఒక లీటర్ పెట్రోల్‌కు 60 నంచి 100 ఎంఎల్ రీడింగ్ ఎక్కువ వచ్చేలా డిస్పెన్సర్ చిప్‌లను రీ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు. అంటే ఒక లీటరు పెట్రోల్ కొట్టమంటే రీడింగ్‌లో ఒక లీటరు కొట్టినట్లు చూపిస్తుంది. మన వాహనంలో మాత్రం 60 నుంచి 100 ఎంఎల్ తక్కువ పడుతుంది. అంటే 900 నుంచి 940 ఎంఎల్ మాత్రమే పడుతుంది. సాధారణంగా మీటర్ రీడింగ కరెక్ట్‌గా ఉండటంతో ఈ మోసాన్ని వాహనదారులు గుర్తించలేరు. తాజాగా అనంతపురం జిల్లాలో మెట్రాలజీ అధికారుల దాడుల్లో ఇలాంటి మోసం ఒకటి బయటపడింది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్, లీగల్ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా ఉమ్మడి అనంతపురం జిల్లలోని కొన్ని పెట్రోల్ బంకుల్లో తనిఖీలు చేశారు.ఈ దాడుల్లో పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసం బయటపడింది. కొన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ కొట్టే గన్‌కు డూప్లికేట్ చిప్ అమర్చి వినియోగదారులకు తక్కువ పెట్రోల్ పోస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
మోసాల కోసం..
పెట్రల్ బంకుల్లోని డిస్పెన్సరింగ్ యూనిట్ (డీయూ) చిప్ ట్యాంపరింగ్ ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. 2023 సంవత్సరం కంటే ముందు తయారైన డీయూ యూనిట్ ఓపెన చేయాలంటే ఓటీపీ అవసరం లేదు. 2023 సంవత్సరం తర్వాత తయారైన డీయూ యూనిట్ ఓపెన్ చేయాలంటే 22 అంకెలు కలిగిన ఓటీపీ వస్తుంది. 11 అంకెలు డీలర్‌కు, మరో 11 అంకలు కంపెనీ టెక్నీషియన్‌కు వస్తుంది. మొత్తం 22 అంకెలు ఎటర్ చేస్తేనే మెషిన్ ఓపెన్ అవుతుంది. ప్రతి కంపెనీకి జిల్లాకు ఒకరు లేదా ఇద్దరు టెక్నీషియన్లు ఉంటారు. దీంతో టెక్నిషియన్లతో జతకట్టి పెట్రోల్ బంకు యజమానులు మెసాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా వినియోదారులు ఎవరైనా బాటిల్స్‌లో పెట్రోల్ పోయాలని అడిగినప్పుడు డీయూ 2 ఆన్, ఆఫ్ రిమోట్ ద్వారా పనిచేసే మెకానిజం ద్వారా కంట్రోల్ చేసి సరైన కొలతతో బాటిల్స్‌ల పెట్రోల్ కొడతారు. వాహనాలు వచ్చినప్పుడు మాత్రం తక్కువ మొత్తంలో పెట్రోల్ పోస్తుంటారు. చిప్ ట్యాంపరింగ్ ద్వారా పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై వినియోగదారులు అప్రమత్తంగా ఉండకపోతేమాత్రం రోజూ మోసపోతూనే ఉంటారు.
ఇవి కూడా చదవండి...
Teacher Beats Students: ప్రభుత్వ పాఠశాలలో దారుణం.. బయటపడ్డ పీఈటీ అరాచకం
phone tapping case twist: ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here