SEEMA: సీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
ABN , Publish Date - Feb 23 , 2025 | 12:26 AM
రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం అందించారు.

పెనుకొండ, ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేకంగా 42 శాతం నిధులను కేటాయించాలని రాయలసీమ విద్యావంతుల వేదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. శనివారం రాయలసీమ విద్యావంతుల వేదిక కన్వీనర్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు సబ్‌కలెక్టర్ కార్యాలయంలో ఏఓ గిరిధర్‌కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రాయలసీమకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. రాష్ట్రం విడిపోయిన తరువాత విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తిచేయాలని, ప్రభుత్వ సంస్థలను అమరావతికి తరలించడం నిలిపివేయాలని, గుంతకల్ రైల్వే జోన ఏర్పాటు చేయాలని, కడప ఉక్కు పరిశ్రమను ప్రభుత్వమే నిర్వహించాలని, హంద్రీనీవాకు లైనింగ్ పనులు ఆపివేసి కాలువ సామర్థ్యాన్ని పెంచాలన్నారు. కార్యక్రమంలో నాయకులు శ్రీరాములు, రమేష్, కోగిర జయచంద్ర, డిగ్రీకళాశాల అధ్యాపకులు రామన్న, జాఫర్ పాల్గొన్నారు.