Shakti Teams : మహిళల రక్షణకు శక్తి
ABN , Publish Date - Mar 15 , 2025 | 12:40 AM
ఆపద సమయాలలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌ను ఆదేశించారు. ప్రతి మహిళ తమ ఫోనలో శక్తి యాప్‌ను డౌనలోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ యాప్ ద్వారా హింసాత్మక ...

జిల్లాలో ఐదు ప్రత్యేక బృందాలు..: ఎస్పీ జగదీష్
అనంతపురం క్రైం, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ఆపద సమయాలలో మహిళలు, అమ్మాయిల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన శక్తి యాప్ గురించి విస్తృత అవగాహన కల్పించాలని ఎస్పీ జగదీష్ పోలీసు అధికారులు, శక్తి టీమ్స్‌ను ఆదేశించారు. ప్రతి మహిళ తమ ఫోనలో శక్తి యాప్‌ను డౌనలోడ్ చేసుకుని, పోలీసుల సాయం పొందేలా చైతన్యపరచాలని సూచించారు. ఈ యాప్ ద్వారా హింసాత్మక ఘటనల నుంచి మహిళలు రక్షణ పొందవచ్చని అన్నారు. ఏదైనా ప్రమాదం తలెత్తితే యాప్ ఓపెన చేసి ఎస్‌ఓఎస్ బటనను నొక్కితే.. బాధితులు ఉన్న లోకొషనను పోలీసులు గుర్తించి, తక్షణమే స్పందిస్తారని తెలిపారు.
రంగంలోకి ఐదు శక్తి బృందాలు
జిల్లాలో మహిళల భద్రత కోసం 5 శక్తి బృందాలను ఈ నెల 8న రంగంలోకి దింపామని ఎస్పీ తెలిపారు. సబ్ డివిజనకు ఒక శక్తి బృందం ఉంటుందని, ఎస్‌ఐ నేతృత్వంలోని ఒక్కో బృందంలో ఇద్దరు మహిళా సిబ్బంది, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారని తెలిపారు. ఈ బృందాలు జిల్లాలోని కళాశాలలు, పార్కులు, ఆర్టీసీ
బస్టాండ్లు, ముఖ్య కూడళ్లలో మఫ్టీలో నిఘా వేస్తాయని తెలిపారు. మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతారని అన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన శక్తి బృందాలు అనంతపురం అర్బన, అనంతపురం రూరల్, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గం సబ్ డివిజన్లలో విధులు నిర్వర్తిస్తాయని తెలిపారు. అదనపు ఎస్పీ నోడల్ అధికారిగా ఉంటారని తెలిపారు. ఆపద సమయంలో శక్తి యాప్‌కు వచ్చే ఎస్‌ఓఎస్, డయల్ 112/100 కాల్స్‌తో సంఘటనా స్థలానికి ఈ టీమ్స్ వెళతాయని తెలిపారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై, సంఘటనా స్థలానికి చేరుకోవాలని, సమస్యను చట్టబద్ధంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....