Share News

Bird : విదేశీ పక్షి స్వాధీనం

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:36 AM

పట్టణంలోని ధర్మవరం గేట్‌ సమీపంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన విదేశీ పక్షి కోకాటైల్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌కే పీట్‌ జోన దుకాణంలో విదేశీ పక్షిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారి అదేశాల ...

Bird : విదేశీ పక్షి స్వాధీనం
Cockatiel bird seized

గుంతకల్లు టౌన, మార్చి 14(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ధర్మవరం గేట్‌ సమీపంలో విక్రయానికి సిద్ధంగా ఉంచిన విదేశీ పక్షి కోకాటైల్‌ను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌కే పీట్‌ జోన దుకాణంలో విదేశీ పక్షిని విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో జిల్లా అటవీ శాఖ అధికారి అదేశాల


మేరకు గుత్తి రేంజర్‌ మధుబాబు, గుంతకల్లు సెక్షన ఆఫీసర్‌ కరీం ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి దాడులు నిర్వహించారు. పక్షిని స్వాధీనం చేసుకుని, దుకాణ నిర్వాహకుడు రాఘవేంద్రపై కేసు నమోదు చేశారు. కోకాటైల్‌ పక్షిని విక్రయించడం వణ్యప్రాణి చట్టం కింద నేరమని వారు తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 15 , 2025 | 12:36 AM