Share News

Nara Lokesh: బాబా చూపిన బాటలోనే నడుద్దాం: మంత్రి లోకేష్

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:31 PM

శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో మంత్రి లోకేష్ పాల్గొని ప్రసంగించారు. బాబా చూపిన బాటలో అందరం నడుద్దామని పిలుపునిచ్చారు.

Nara Lokesh: బాబా చూపిన బాటలోనే నడుద్దాం: మంత్రి లోకేష్
Minister Nara Lokesh

శ్రీ సత్యసాయి జిల్లా , నవంబర్ 19: భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి మహోత్సవాల సందర్భంగా హిల్ వ్యూ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ (Minister Nara lokesh) ప్రసంగించారు. మనుషుల్లో ప్రేమ ఉన్నంత వరకు సత్యసాయి బాబా మన మధ్యే ఉంటారన్నారు. ఇక్కడకు వచ్చినపుడల్లా బంగారూ అని బాబా పిలచినట్లుగా అనిపిస్తుందని సత్యసాయి బాబాను స్మరించుకున్నారు. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా చూపిన బాటలో మనమంతా నడవాలన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో సత్యసాయి ట్రస్ట్ విద్య, వైద్య సేవలు అందిస్తోందని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.


కాగా.. సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ముందుగా సాయి కుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని దర్శించుకున్నారు. అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల్లో మోదీ పాల్గొన్నారు. ఈ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో పాటు సచిన్ టెండూల్కర్, ఐశ్వర్యా రాయ్ బచ్చన్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఉత్సవాల్లో భాగంగా బాబా జీవితం, బోధనలు, సేవల స్మారకార్థంగా రూపొందించిన రూ.100 నాణెం, 4 తపాలా బిళ్లలను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వీవీఐపీల రాక సందర్భంగా పుట్టపర్తితో భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఇవి కూడా చదవండి...

చరిత్రలో ఇదే ప్రథమం.. మావోల అరెస్ట్‌పై ఏడీజీ

మావోలకు దెబ్బ మీద దెబ్బ... నిన్న హిడ్మా.. నేడు మరికొందరు

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 19 , 2025 | 01:08 PM