Share News

Ganga puja ఆలమూరు చెరువుకు ఎమ్మెల్యే గంగపూజ

ABN , Publish Date - Oct 23 , 2025 | 12:55 AM

మండలంలోని ఆలమూరు చెరువు రెండురోజుల కిందట మరువ పారింది. దీంతో ఆ చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సాయంత్రం పరిశీలించారు.

Ganga puja  ఆలమూరు చెరువుకు ఎమ్మెల్యే గంగపూజ
చెరువు వద్ద జలహారతి ఇస్తున్న ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురంరూరల్‌, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): మండలంలోని ఆలమూరు చెరువు రెండురోజుల కిందట మరువ పారింది. దీంతో ఆ చెరువును ఎమ్మెల్యే పరిటాల సునీత బుధవారం సాయంత్రం పరిశీలించారు.


గంగపూజ నిర్వహించి, జలహారతి ఇచ్చారు. గంగమ్మ తల్లికి సారె సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాప్తాడు నియోజకవర్గంలో ప్రతి చెరువును హంద్రీ నీవా నీటితో నింపాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. నియోజకవర్గానికి హంద్రీనీవా నీరు రాదని వైసీపీ నాయకులు దుష్ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు గతం కంటే ఎక్కువగా చెరువులకు నీరు అందుతోందని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు దుష్ప్రచారం మానాలన్నారు. తొలుత గ్రామస్థులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. కార్యక్రమంలో టీడీపీ సీనియర్‌ నాయకులు ఆలమూరు సూరి, నాగేంద్రరెడ్డి, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 23 , 2025 | 12:55 AM