Share News

Holly : రంగ్‌దే..!

ABN , Publish Date - Mar 15 , 2025 | 12:47 AM

జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరం శుక్రవారం ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందడోలికల్లో మునిగితేలారు. అనంతపురం నగరంతోపాటు... బంజారాలు అధికంగా ఉండే తండాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో కాముడి దహనం కార్యక్రమాలు చేశారు. ఇస్కాన మందిరంలోనూ ...

 Holly : రంగ్‌దే..!
Marwaris celebrating Holi

అంబరాన్నంటిన హోలీ సంబరాలు

అనంతపురం కల్చరల్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరం శుక్రవారం ఘనంగా జరిగాయి. పిల్లలు, పెద్దలు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఆనందడోలికల్లో మునిగితేలారు. అనంతపురం నగరంతోపాటు... బంజారాలు అధికంగా ఉండే తండాలలో వేడుకలు వైభవంగా జరిగాయి. పలు ప్రాంతాల్లో కాముడి దహనం కార్యక్రమాలు చేశారు. ఇస్కాన మందిరంలోనూ


హోలికా దహనం చేపట్టారు. జిల్లా కేంద్రంలో యువకులు బైక్‌లపై తిరుగుతూ రంగులు చల్లుకున్నారు. బంజారాలు డ్రమ్స్‌ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ర్యాలీగా తిరుగుతూ సంబరాలు జరుపుకున్నారు. మహిళలు కంకుమనీళ్లు, సంప్రదాయ రంగులతో సంబరం చేసుకున్నారు. పిల్లలు వాటర్‌ గనలతో రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా గడిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Mar 15 , 2025 | 12:47 AM