eKYC రైతులు ఈకేవైసీ వెంటనే చేయించుకోవాలి
ABN , Publish Date - Jun 21 , 2025 | 01:54 AM
అన్నదాతా సుఖీభవ పథకానికి ఈ కేవైసీ పెండింగ్‌లో ఉన్న రైతులందరూ వెంటనే చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు.

రాప్తాడు, జూన 20(ఆంధ్రజ్యోతి): అన్నదాతా సుఖీభవ పథకానికి ఈ కేవైసీ పెండింగ్‌లో ఉన్న రైతులందరూ వెంటనే చేయించుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి ఉమామహేశ్వరమ్మ తెలిపారు.
మండలంలోని మరూరు, రాప్తాడు, రైతు సేవాకేంద్రాలను శుక్రవారం ఆమె పరిశీలించారు. ఆమె మా ట్లాడుతూ.. ప్రభుత్వం సబ్సిడీపై అందించే విత్తన వేరుశనగ కాయలను రైతు లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు, సిబ్బం ది రైతులకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. ఏఓ కృష్ణచైతన్య, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..