Share News

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

ABN , Publish Date - Feb 18 , 2025 | 12:03 AM

అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు.

ANGANWADI: అంగనవాడీ కార్యకర్తల ఆందోళన

మడకశిరటౌన, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి): అంగనవాడీ ఉద్యోగులు తమ న్యాయబద్ధమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం పట్టణంలోని ఐసీడీఎస్‌ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. అంగనవాడీలకు కనీస వేతనం రూ.26వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన సెంటర్‌లుగా మార్పు చేయాలని, హెల్పర్‌ ప్రమోషన్లకు నిర్దిష్టమైన గైడ్‌లైన్స ఇవ్వాలని, మెనూ చార్జీలు పెంచాలని, ఉచితంగా గ్యాస్‌ సరఫరా చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం అంగనవాడీ ఉద్యోగులు సీడీపీఓ నాగమల్లేశ్వరికి వినతిపత్రం అందజేశారు.

సోమందేపల్లి: కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని అంగనవాడీ టీచర్లు, ఆయాలు సోమవారం ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సాయిబాబా ఆలయం వద్ద నుంచి ర్యాలీగా వెళ్లి మణికంఠ కాలనీలో ఉన్న కార్యాలయం వద్ద బైఠాయించారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశులు మాట్లాడుతూ అంగనవాడీల వేతనాన్ని పెంచి గ్రాట్యుటీ అమలు చేయాలన్నారు. పలు డిమాండ్‌లతో కూడిన వినతిపత్రాన్ని కార్యాలయ సిబ్బందికి అందించారు. ప్రాజెక్టు కార్యదర్శి శ్రీదేవి, రాధమ్మ, సావిత్రి, విజయలక్ష్మి, నాగరత్న పద్మావతి పాల్గొన్నారు.

పెనుకొండ: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగనవాడీ కార్యకర్తలు సోమవారం ధర్నా చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్‌, ఉపాధ్యక్షుడు పెడబల్లి బాబా ఆధ్వర్యంలో బ్యానర్లతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్‌ సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. ఐసీడీఎస్‌ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. యూనియన నాయకులు జయమ్మ, బావమ్మ, మాబున్నీసా, సావిత్రమ్మ, లక్ష్మీదేవి, పద్మ, సరస్వతి, మీనాకుమారి, శాంతిబాయి, అరుణ పాల్గొన్నారు.

Updated Date - Feb 18 , 2025 | 12:03 AM