Share News

theft చోరీపై పోలీసులకు ఫిర్యాదు

ABN , Publish Date - Oct 24 , 2025 | 01:08 AM

మండలంలోని యర్రగుంట్లలో ఎర్రిస్వామి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు గురువా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, రేణుక దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.

theft చోరీపై పోలీసులకు ఫిర్యాదు

గార్లదిన్నె, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): మండలంలోని యర్రగుంట్లలో ఎర్రిస్వామి అనే రైతు ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు బాధితుడు గురువా రం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. యర్రగుంట్ల గ్రామానికి చెందిన ఎర్రిస్వామి, రేణుక దంపతులు వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు.


రోజూ మాదిరిగానే గత బుధవారం ఇంటికి తాళం వేసి పనులకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగులకొట్టి లోపలికి చొరబడి బీరువాలోని రూ. 34వేలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు బాధితుడు ఫిర్యాదు చేశాడని, విచారణ చేసి చోరీకి పాల్పడిన దుండగులను పట్టుకుంటామని ఎస్‌ఐ మహమ్మద్‌గౌస్‌ బాషా తెలిపారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Oct 24 , 2025 | 01:08 AM