AP News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
ABN , Publish Date - Apr 13 , 2025 | 10:14 AM
AP Road Accident: సత్యసాయి జిల్లాలో ఆదివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు భక్తులు మృతిచెందగా పలువురు గాయాల బారిన పడ్డారు.

శ్రీ సత్యసాయి జిల్లా: శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవాళ(ఆదివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పరిగి మండలం ధనాపురం హైవే వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. భక్తులు వస్తున్న ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు మృతి చెందగా, మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. కోటికి చౌడేశ్వరి ఆలయానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు రొద్దం మండలం దొడగట్ట గ్రామానికి చెందిన వారిగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
సత్యసాయి జిల్లాలో రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పరిగి మండలం, ధనాపురం వద్ద ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రొద్దం మండలం, దొడగట్ట గ్రామానికి చెందిన అలివేలమ్మ, ఆదిలక్ష్మీ, సుంకమ్మ అనే ముగ్గురు మహిళలు మృతిచెందారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో పదిమంది క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. హిందూపురం రూరల్ మండలం కోటీపీ చౌడేశ్వరిదేవి జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా హిందూపురం-సిరా హైవేపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ: మంత్రి అనగాని సత్యప్రసాద్
సత్యసాయి జిల్లా పరిగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు చనిపోవడం, పలువురు గాయపడటం తీవ్ర ఆవేదన కలిగించిందని మంత్రి సత్యప్రసాద్ అన్నారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు ప్రమాద ఘటనపై విచారణ జరిపిస్తున్నామని మంత్రి సత్య ప్రసాద్ తెలిపారు. రోడ్డు ప్రమాద బాధిత కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని మంత్రి సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలి: మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
సత్యసాయి జిల్లా ధనాపురం రోడ్డులో ఆటో ప్రమాద ఘటనపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆరా తీశారు. ఆటోలోని ముగ్గురు మహిళ ప్రయాణికుల మృతి పట్ల మంత్రి మండిపల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని వైద్యాధికారులకు మంత్రి సూచించారు. ప్రయాణ సమయాల్లో ప్రజలు రవాణా భద్రతలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Nara Lokesh: సొంత నియోజకవర్గంలో మరో హామీకి నారా లోకేష్ శ్రీకారం
AP NEWS: తిరుమలకు అన్నలెజినోవా.. అసలు కారణమిదే..
Birthday Celebrations: 20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు
Read Latest AP News And Telugu News