Bear Attack: ఎలుగుబంటి హల్చల్.. వణికిపోతున్న ప్రజలు
ABN , Publish Date - May 23 , 2025 | 11:00 AM
Bear Attack: సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. రాత్రి సమయంలో ఓ స్కూల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

శ్రీసత్యసాయి జిల్లా, మే 23: ఈ మధ్యకాలంలో కొన్ని జంతువులు అడవులను వీడి జనావాసాల్లోకి వచ్చేస్తున్నాయి. పులి (Tiger), ఎలుగుబంటి (Bear) వంటి జంతువులు ఊర్లలోకి ప్రవేశించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. రాత్రుళ్లు రోడ్లపై సంచరిస్తూ హల్చల్ చేస్తున్నాయి. అంతే కాకుండా ఎవరైనా కనిపిస్తే వారిపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సార్లు పులుల దాడుల్లో పలువురు చనిపోయిన ఘటనలు చాలా ఉన్నాయి. దీంతో పులి, ఎలుగుబంటి సంచారం వార్త వింటే చాలు ప్రజల్లో వణుకు మొదలవుతుంది. తాజాగా శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంటి సంచారం కలకలం రేపుతోంది. ఈ ఎలుగుబంటి ఏకంగా ప్రైవేటు స్కూల్లోకే వెళ్లి కలియతిరిగింది.
మడకశిర పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్లో ఎలుగుబంటి హల్చల్ చేసింది. రాత్రి సమయంలో స్కూల్లో మొత్తం తిరిగింది. స్కూల్ ఆవరణలో తిరుగుతున్న ఎలుగుబంటిని స్థానికులు గమనించారు. దీంతో వెంటనే అరుపులు, కేకలు వేశారు. ప్రజల అరుపులు విన్న ఎలుగుబంటి కొండ ప్రాంతంలోకి పారిపోయింది. ఎలుగుబంటి సంచారంపై గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఎలుగుబంటి బారి నుంచి తమను రక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
వ్యక్తిపై దాడి
మరోవైపు అనంతపురం జిల్లాలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. కళ్యాణదుర్గం మండలం మోరేపల్లి గ్రామంలో బలరాముడు అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడికి తెగబడింది. గ్రామంలోకి వచ్చిన ఎలుగుబంటి పొలాల్లో సంచరించింది. ఈ విషయాన్ని గ్రామస్థులు గుర్తించలేదు. దీంతో యదావిధిగా పొలం పనులకు వెళ్లారు ప్రజలు. బలరాముడు కూడా పొలంలోకి వెళ్లాడు. అతడి రాకను చూసిన ఎలుగుబంటి ఒక్కసారిగా దాడి చేసింది. వెంటనే భయాందోళనకు గురైన సదరు వ్యక్తి కేకలు వేస్తూ.. దాన్ని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. అయితే ఎలుగుబంటి దాడిని గమనించిన స్థానికులు గట్టిగా కేకలు వేశారు. దీంతో వెంటనే ఎలుగుబంటి ముళ్లపొదల్లోకి పారిపోయింది. ఎలుగుబంటి దాడిలో తీవ్ర గాయాలపాలైన బలరాముడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి దాడి చేసిన విషయాన్ని గ్రామస్తులు అటవీ శాఖ అధికారులకు తెలియజేశారు. వెంటనే ఎలుగుబంటిని బంధించాల్సిందిగా అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
ఉగ్ర కుట్రలు.. రహస్య విచారణకు సన్నద్ధం
Read Latest AP News And Telugu News