Share News

SCIENTIST: పొలుసుపై జాగ్రత్త వహించండి

ABN , Publish Date - Feb 10 , 2025 | 11:58 PM

చీనీ పంటకు వ్యాపించే పొలుసు పురుగుపై రైతులు జాగ్రత్త వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కిశోర్‌ పేర్కొన్నారు. సోమవారం తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి వద్ద చీనీ తోటను పరిశీలించారు.

SCIENTIST: పొలుసుపై జాగ్రత్త వహించండి
Scientists examining a Chinese garden

తాడిమర్రి, ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): చీనీ పంటకు వ్యాపించే పొలుసు పురుగుపై రైతులు జాగ్రత్త వహించాలని కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ కిశోర్‌ పేర్కొన్నారు. సోమవారం తాడిమర్రి మండలంలోని ఏకపాదంపల్లి వద్ద చీనీ తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పొలుసు పురుగు ఉధృతి ఎక్కువగా ఉందని, ఇది లేత ఇగుర్లు, పూతను దెబ్బతీసిందన్నారు. పురుగుల మందులే కాకుండా పసుపు రంగు చిగురు అట్టలు అమర్చి నివారించుకోవచ్చ అన్నారు. ఇమిడా క్లోఫ్రిడ్‌ 0.5ఎంఎల్‌ లేదా థయోమెతాక్క్సిన 0.3గ్రాములు లీటరు నీటిలో కలిపి మొక్కలు, మొదళ్ల పైవరకు తడిసేలా పిచికారి చేయాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కూచిరాము, రైతులు, కేవీకే సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Feb 10 , 2025 | 11:58 PM