ERADICATION: నాటుసారా నిర్మూలనపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Mar 02 , 2025 | 12:21 AM
గిరిజన, గ్రామీణప్రాంతాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డీఓ సువర్ణ సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నవప్రొహిబిషన ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

పుట్టపర్తి రూరల్, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): గిరిజన, గ్రామీణప్రాంతాలలో నాటుసారా నిర్మూలనపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆర్డీఓ సువర్ణ సూచించారు. శనివారం ఎంపీడీఓ కార్యాలయంలో నవప్రొహిబిషన ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలన కార్యక్రమం నవోదయం 2.0పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీఓ, ఎక్సైజ్‌శాఖ ఈఎస్ నరసింహులు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలన లక్ష్యంగా పోలీసులు, ఎక్సైజ్‌శాఖ అటవీ, రెవెన్యూశాఖలు సంయుక్తంగా ప్రజల్లోకి వెళ్ళి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. పుట్టపర్తి నల్లమాడ, తహసీల్దార్లు డీపీఓ ఆఫీస్ ఏఓ, ఎక్సైజ్ సీఐ నాగరాజు, ఎంపీడీఓ నాగేశ్వరరెడ్డి, నల్లమాడ సీఐ, బుక్కపట్నం ఎస్‌ఐ పాల్గొన్నారు.
ధర్మవరం: నాటుసారా రహితంగా మార్చడమే నవోదయ 2.0లక్ష్యమని ఆర్డీఓ మహేశ పేర్కొన్నారు. స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో శనివారం ప్రొహిబిషనఅండ్ ఎక్సైజ్‌శాఖ ఆధ్వర్యంలో నాటుసారా నిర్మూలనా కార్యక్రమం నవోదయ 2.0కు సంబంధించిన పోస్టర్లను ఆర్డీఓతో పాటు ఎక్సైజ్‌్‌శాఖ అధికారులు ఆవిష్కరించారు. వారు ఏపీని నాటుసారా రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నవోదయ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. ఎక్సైజ్ అధికారులు గోవిందనాయక్, శ్రీరామ్, చంద్రమణి, ఫరూక్, చాంద్‌బాషా పాల్గొన్నారు.