Share News

AP BJP Chief: తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ABN , Publish Date - Jul 30 , 2025 | 06:45 PM

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ రాయలసీమలో పర్యటిస్తున్నారు. అందులోభాగంగా బుధవారం అనంతపురంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

AP BJP Chief: తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
AP BJP Chief PVN Madhav

అనంతపురం, జులై 30: ఏపీలో మద్యం వ్యవహారంలో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ తప్పు చేస్తే తప్పకుండా అరెస్టవుతారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. మద్యం స్కామ్‌లో సింగిల్ టెండర్‌తో ఒకరే సప్లై చేశారని పేర్కొన్నారు. ఆన్‌లైన్ క్యాష్ పేమెంట్లు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు.

బుధవారం అనంతపురం జిల్లాలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా విలేకర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చిట్ చాట్ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాయలసీమలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు రాబోతున్నాయన్నారు. టమోటాకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ సైతం రాయలసీమకు రానుందని చెప్పారు.


రాయదుర్గంలో సాగయ్యే వంకాయకు రుచి బాగా ఉంటుందన్నారు. అలాగా టమోటా రైతులు కూడా విభిన్నంగా పండించేందుకు ట్రై చేయాలని చెప్పారు. రెండో పంట వరి వేయకుండా వేరే పంట వేస్తే రైతులకు మేలు జరిగే అవకాశముందన్నారు. అయితే అనంతపురంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ రావడం మంచి పరిణామమని పేర్కొన్నారు.


క్వినోవా మంచి రేటు ఉండడంతో కొంత మంది క్వినోవా వేస్తున్నారు. కానీ మన దగ్గర అది పనికి రాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అభిప్రాయపడ్డారు. చిత్తూరు పాడి రైతులకు మంచి ధర లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కొంత మంది పాడి పరిశ్రమని శాసిస్తున్నారని ఆరోపించారు.


ఇక బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో గొడవలు రావడమనేది సహజమన్నారు. తెలుగుదేశం పార్టీతో తమకు సహజ సిద్ధమైన పొత్తు ఉందని గుర్తు చేశారు. మరోవైపు ఇక్కడి ప్రజలు రెండు మైండ్ సెట్లతో ఉన్నారన్నారు. వారి మైండ్ సెట్ మార్చాల్సిన అవసరం అయితే లేదని తెలిపారు.


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ ఇటీవల ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో ప్రస్తుతం ఆయన రాయలసీమలో పర్యటిస్తున్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలో ఆయన పర్యటించారు. మద్యం కుంభకోణం కేసులో వైఎస్ జగన్ అరెస్ట్ తప్పదని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ జిల్లాల ప్రజలకు బిగ్ అలర్ట్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 06:57 PM