MINISTER SAVITHA: ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించండి
ABN , Publish Date - Jan 21 , 2025 | 12:22 AM
ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు.

సోమందేపల్లి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): ప్రజాసమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను బీసీ సంక్షేమ, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్ కార్యక్రమంలో మంత్రి అర్జీలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రతి పథకం ప్రజలకు చేరేలా పనిచేయాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం దశలవారీగా నెరవేరుస్తోందన్నారు. తల్లికి వందనం, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం, రైతు భరోసా, కొత్తరేషన కార్డులు, పింఛన్లు, ఎన్టీఆర్ హౌసింగ్ తదితర పథకాలను త్వరలో అమలు చేస్తామన్నారు. ప్రజాదర్బార్‌లో ఏకంగా 525 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో ఆర్డీఓ ఆనంద్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తహసీల్దార్ రెడ్డి శేఖర్ పాల్గొన్నారు.
కియ సెల్ఫీ స్పాట్ పరిశీలన: పెనుకొండ రూరల్: కియ కార్ల పరిశ్రమ ఎదురుగా చేపట్టిన పార్కు సుందరీకరణ పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం కూటమి నాయకులతో కలిసి సెల్ఫీస్పాట్‌లో సెల్ఫీ తీసుకున్నారు.
బాధితురాలికి పరామర్శ: పెనుకొండ రూరల్: మండలంలోని మునిమడుగు గ్రామంలో నాలుగు రోజుల క్రితం వెంకటలక్ష్మి జుత్తు కత్తిరించి, చిత్రహింస పెట్టిన విషయం విదితమే. విషయం తెలుసుకున్న మంత్రి సవిత మునిమడుగు గ్రామానికి చేరుకుని, వెంకటలక్ష్మిని పరామర్శించారు. అధైర్యపడొద్దనీ, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలే ప్రసక్తేలేదనీ, కఠినంగా శిక్షిస్తామన్నారు.