RAILY DRM: బడ్జెట్‌లో రైల్వేకు అదనపు నిధులు
ABN , Publish Date - Feb 04 , 2025 | 12:14 AM
పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే ఎక్కువ నిధులు రానున్నాయని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులపై దక్షిణ మధ్య రైల్వే, సౌత కోస్ట్ రైల్వేల జీఎంలు, తెలుగు రాషా్ట్రల్లోని రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.

గుంతకల్లు, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గత సంవత్సరం కంటే ఎక్కువ నిధులు రానున్నాయని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా పేర్కొన్నారు. బడ్జెట్‌లో రైల్వేలకు కేటాయింపులపై దక్షిణ మధ్య రైల్వే, సౌత కోస్ట్ రైల్వేల జీఎంలు, తెలుగు రాషా్ట్రల్లోని రైల్వే డివిజన్ల డీఆర్‌ఎంలతో రైల్వే శాఖ మంత్రి అశ్విన వైష్ణవ్ వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా రైల్వే మంత్రి మాట్లాడుతూ తెలుగు రాషా్ట్రలకు గత సంవత్సరం బడ్జెట్‌లో రూ. 9,151 కోట్ల నిధులు లభిస్తే ఈ సంవత్సరం రూ. 9,417 కోట్ల నిధులు దక్కాయని తెలిపారు. 2009 నుంచి ఐదేళ్ల కాలంలో కాంగ్రెస్ పాలనలో ఏపీకి సంవత్సరానికి సగటున రూ. 886 కోట్ల నిధులు లభించాయని, ఎన్డీయే-3 హయాంలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ. 9,417 కోట్లు వచ్చాయన్నారు. అప్పటితో పోలిస్తే 10 రెట్ల అదనపు నిధులు లభించాయన్నారు. వీడియో కాన్ఫరెన్సలో జీఎం అరుణ్ మాట్లాడుతూ.. ఈ బడ్జెట్‌లో రైల్వేకు తెలుగు రాషా్ట్రలకు నిధులు ఏయే ప్రాజెక్టులకు ఏమేరకు లభించాయో, కొత్త ప్రాజెక్టులు పరిస్థితి, కొత్త రైళ్ల కేటాయింపు వివరాలపై త్వరలో పింక్‌బుక్ విడుదల చేస్తామని వివరించారు. గుంతకల్లు రైల్వే డివిజనకు గతంలో లభించిన అమృత స్టేషన్లకు, కడప-బెంగళూరు, గుంతకల్లు-గుంటూరు డబ్లింగ్, గుత్తి-పెండేకల్లు డబ్లింగ్, నడికుడి-శ్రీకాళహస్తి డబ్లింగ్ లైన్లకు నిధుల పెద్ద మొత్తాల్లో లభించే అవకాశముందని రైల్వే అధికారులు అభిప్రాయపడ్డారు. డివిజన నుంచి వీడియో కాన్ఫరెన్సలో డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్తా, ఏడీఆర్‌ఎం సుధాకర్, సబార్డినేట్ అధికారులు పాల్గొన్నారు.
వందేళ్లలో రైల్వే అభివృద్ధి అమోఘం
దేశంలో విద్యుత రైళ్ల ఆవిష్కరణ తర్వాత వందేళ్లలో రైల్వేలు శరవేగంతో అభివృద్ధిని సాధించాయని డీఆర్‌ఎం చంద్రశేఖర్ గుప్త పేర్కొన్నారు. దేశంలో విద్యుత రైళ్లు ప్రారంభమై వందేళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం ఉదయం వాకథాన నిర్వహించారు. స్థానిక డీఆర్‌ఎం కార్యాలయం నుంచి రైల్వే అధికారులు, సిబ్బంది పాదయాత్రగా బయలుదేరి రైల్వే స్టేషనకు చేరుకున్నారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం మాట్లాడుతూ.. విద్యుత రైళ్ల ఆవిష్కరణ తర్వాత రైల్వేలు దేశంలో బలీయమైన ఆర్థిక శక్తిగా మారాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా మారేంతగా రైల్వేల ప్రాముఖ్యత పెరిగిపోయిందన్నారు. అనంతరం రైల్వే స్టేషన వద్ద ఏర్పాటుచేసిన విద్యుదీకరణకు సంబంధించిన చిత్రాల ఎగ్జిబిషనను డీఆర్‌ఎం ప్రారంభించారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం సుధాకర్, సీనియర్ డీఈఈ సుదర్శన, సీనియర్ డీఎంఈ మంగాచార్యులు, సీనియర్ డీపీఓ క్యాప్రిల్ అరోరా తదితరులు పాల్గొన్నారు.