Amaravati Innovation Hub: అమరావతిలో సైన్స్ సిటీ
ABN , Publish Date - Apr 07 , 2025 | 04:30 AM
అమరావతిలో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సూచనాత్మక అంగీకారం తెలిపింది. రూ.200 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాల్లో నిర్మించనున్నారు

రూ.200 కోట్ల వ్యయంతో 50 ఎకరాల్లో నిర్మాణం
మంగళగిరి, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో సైన్స్ సిటీని ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా అంగీకరించింది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 50 ఎకరాలకు పైగా స్థలాన్ని కేటాయించనుంది. ఇందులో రూ.200 కోట్ల వ్యయంతో సైన్స్ సిటీని ఏర్పాటు చేస్తారు. దీనిలో పది మ్యూజియంలు, ఇంక్యుబేషన్ కేంద్రాలు, గ్లోబల్ రీసెర్చ్ కొలాబరేషన్, యువతలో ఆవిష్కరణలకు సంబంధించిన నైపుణ్యాల పెంపు కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. వాస్తవానికి సైన్స్ సిటీల నిర్మాణానికి అయ్యే ఖర్చులో సగాన్ని కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మంజూరు చేస్తుంది. మిగతా సగం రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి. కానీ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో మొత్తం ఖర్చు భరించాలని సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో సైన్స్ సిటీని ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర సైన్స్ సిటీ సీఈవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సైన్స్ సిటీ ద్వారా అమరావతి సరికొత్త సాంకేతిక ఆవిష్కరణలకు కేంద్ర బిందువుగా మారుతుందని తెలిపారు. వచ్చే అయిదేళ్లలో సైన్స్ సిటీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Krishna River Tragedy: పండగ వేళ ఘోర విషాదం.. కృష్ణానదిలో పడి.. బాబోయ్..
Mahesh Kumar Goud: మోదీ, అమిత్ షా అనుమతి లేకుండా బండి సంజయ్ టిఫిన్ కూడా చెయ్యరు: మహేశ్ కుమార్ గౌడ్