Amaravati Land Allotment: మంత్రివర్గ ఉపసంఘంతో చర్చించాక అమరావతి రెండో దశ భూసమీకరణ
ABN , Publish Date - Jul 22 , 2025 | 05:44 AM
అమరావతిలో రెండో దశ భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా? అని గత మంత్రివర్గ సమావేశంలో ..

మూడేళ్లలో నిర్మాణం కచ్చితంగా పూర్తి
మార్చి నాటికి ప్రభుత్వ భవనాలు పూర్తిచేేసలా అడుగులు
మంత్రి నారాయణ
గుంటూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): ‘అమరావతిలో రెండో దశ భూసమీకరణపై మంత్రివర్గ ఉపసంఘంలో చర్చించారా? అని గత మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అందువల్ల మంత్రివర్గ ఉపసంఘంలో చర్చిస్తాం. ఉపసంఘం నిర్ణయం మేరకు వచ్చే కేబినెట్‌లో భూసమీకరణపై నిర్ణయం తీసుకుంటాం’ అని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరి నారాయణ తెలిపారు. రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులను సీఆర్డీఏ ఇంజనీర్లతో కలిసి మంత్రి నారాయణ సోమవారం పరిశీలించారు. మంత్రులు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శుల బంగ్లాలతో పాటు ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. ఆయా నిర్మాణాలకు సంబంధించి నిర్మాణ సంస్థల ప్రతినిధులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నేలపాడులోని ఆలిండియా సర్వీస్ అధికారుల క్వార్టర్ల వద్ద మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ...‘గత ప్రభుత్వం అమరావతి రైతులతో పాటు కాంట్రాక్టర్లను కూడా అనేక ఇబ్బందులకు గురిచేసింది. అమరావతి నిర్మాణం మూడేళ్లలో కచ్చితంగా పూర్తిచేసి తీరుతాం. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలను వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేస్తాం. అమరావతిలో భవనాలు, ట్రంక్ రోడ్లు, సీవరేజి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎల్పీఎస్ లేఅవుట్లలో పనులకు కూడా టెండర్లు పూర్తయ్యాయి. 2014-19 మధ్యలోనే అధికారుల కోసం 4000 ఇళ్ల నిర్మాణానికి టెండర్లు కూడా పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించాం. అయితే గత ప్రభుత్వం అన్ని పనులను నిలిపివేసింది. తిరిగి పాత టెండర్లు రద్దు చేసి, న్యాయపరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకుని కొత్తగా టెండర్లు పిలిచేందుకు ఆలస్యమైంది. ప్రస్తుతం రాజధానిలో అన్ని పనులు వేగంగా జరుగుతున్నాయి. కొన్నిచోట్ల మాత్రం వర్షాల కారణంగా కొంచెం ఇబ్బందులున్నాయి’ అని వివరించారు.
72 సంస్థలకు భూకేటాయింపు
అమరావతిలో ఇప్పటివరకూ మొత్తం 72 సంస్థలకు భూకేటాయింపులు చేసినట్టు మంత్రి నారాయణ తెలిపారు. ఆయా సంస్థల ప్రతినిధులతో స్వయంగా సీఎం చంద్రబాబు సమావేశం ఏర్పాటు చేసి ఒప్పందాలు చేసుకున్నట్టు, వాటిలో మెజారిటీ సంస్థలు ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి నిర్మాణ పనులు ప్రారంభిస్తాయని మంత్రి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News