B Rajasekhar: అగ్రి ఇన్‌పుట్స్ లైసెన్సింగ్‌కు అజైల్ యాప్
ABN , Publish Date - Jul 03 , 2025 | 05:46 AM
వ్యవసాయ శాఖ కొత్తగా రూపొందించిన అగ్రి ఇన్‌పుట్ లైసెన్స్ ఇంజిన్ అజైల్ యాప్‌ను ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ బుధవారం అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు.

అమరావతి, జూలై2 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ శాఖ కొత్తగా రూపొందించిన అగ్రి ఇన్‌పుట్ లైసెన్స్ ఇంజిన్ (అజైల్) యాప్‌ను ఆశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీ రాజశేఖర్ బుధవారం అమరావతి సచివాలయంలో ఆవిష్కరించారు. పల్నాడు జిల్లాకు చెందిన మహిళా డీలర్‌కు ఎరువుల తయారీకి అవసరమైన తొలి డిజిటల్ లైసెన్స్ జారీ చేశారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ... విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు వంటి ఇన్‌పుట్స్ వ్యాపారానికి సంబంధించిన లైసెన్స్‌ల కోసం అజైల్ ఫ్లాట్ ఫాం తప్పనిసరిగా వినియోగించాలని వ్యాపారులకు సూచించారు.
ఇది సెంట్రలైజ్డ్ డిజిటల్ ఇన్‌పుట్ మేనేజ్‌మెంట్ సిస్టం అని వివరించారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ... ఈయాప్ ద్వారా అందుబాటులోకి వచ్చే పర్యవేక్షక కార్యకలాపాలను, వ్యాపారులు, రైతులకు అందుబాటులోకి వచ్చే సేవలను తెలిపారు. కార్యక్రమంలో ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు, రైతు సాధికార సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు విజయ్‌కుమార్, వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల వీసీలు శారదా జయలక్ష్మి, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.