Share News

AP ECET 2025: ఈసెట్‌కు 35,187 దరఖాస్తులు

ABN , Publish Date - Apr 30 , 2025 | 06:03 AM

ఈసెట్-2025కు 35,187 దరఖాస్తులు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు. మే 1 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్స్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు

AP ECET 2025: ఈసెట్‌కు 35,187 దరఖాస్తులు

  • 1 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌ టికెట్స్‌

అనంతపురం సెంట్రల్‌, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌(ఈసెట్‌-2025)కు ఏపీ, తెలంగాణతో కలిపి 35,187 దరఖాస్తులు వచ్చాయని సెట్‌ నిర్వాహక కమిటీ చైర్మన్‌, అనంతపురం జేఎన్టీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శనరావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం ఏపీలో 109, హైదరాబాద్‌లో ఒకటి మొత్తం 110 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని, మే 1 నుంచి హాల్‌ టికెట్స్‌ను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించారు. ఆన్‌లైన్‌ పద్ధతిలో మే 6న.. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు.

Updated Date - Apr 30 , 2025 | 06:03 AM